కరోనా బూచి: కోవిడ్-19 వ్యాధి వచ్చిందని స్వీడన్ లో ఆత్మహత్య చేసుకున్న ఓ భారతీయుడు..!

Suma Kallamadi

నివేదికల ప్రకారం భారతదేశంలో 9 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఐతే కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం... విదేశాల్లో ముగ్గురు భారతీయ వ్యక్తులు కరోనా వైరస్ కారణంగా చనిపోయారని తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇరాన్ లో చనిపోగా, రెండవ వ్యక్తి ఈజిప్ట్ లో మరణించగా మూడవ వ్యక్తి స్వీడన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ... ఒక భారతీయ వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందనే మనస్థాపంతో స్వీడన్ దేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.




ఇరాన్ లో చనిపోయిన భారతీయ వ్యక్తికి 70 ఏళ్లు ఉండగా... ఈజిప్ట్ లో చనిపోయిన వ్యక్తికి 52ఏళ్లు ఉన్నాయి. స్వీడన్ లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వయసు కేవలం 42 సంవత్సరాలే. అయితే భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో 276 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకిందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇరాన్ దేశంలో 255 మంది భారతీయులు కరోనా వైరస్ బారిన పడగా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 12 మంది... ఇటలీలో ఐదుగురు ఇండియన్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక మిగిలిన వారిలో హాంకాంగ్ లో ఒకరు, కువైట్ లో ఒకరు, ర్వాదన లో ఒకరు, శ్రీలంక లో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు.




ఇకపోతే కౌలాలంపూర్ విమానాశ్రయ రవాణాలో చిక్కుకుపోయిన 113 భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకు వచ్చే పనిలో నిమగ్నమయ్యారు విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇప్పటికే భారతదేశంలో 471 కరోనా కేసులు నమోదు కాగా... తొమ్మిది మంది చనిపోగా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సాగిస్తున్నాయి. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నుండి ఎవరు బయటికి రాకూడదని ప్రజలకు ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ... చాలామంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల లోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో అందరూ ఇళ్లలకు పరిమితం అవ్వడమే శ్రేయస్కరం. అందుకుగాను పోలీసులు బయటికి వచ్చిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: