కరోనా సాయం: తెలంగాణకు సత్య నాదెళ్ల భార్య భారీ విరాళం..?

Chakravarthi Kalyan
కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచమే శ్రమిస్తోంది. అన్ని దేశాలు కరోనాతో పోరాడుతున్నాయి. ప్రపంచమే షట్ డౌన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అయితే కరోనాపై పోరాటం కేవలం ప్రభుత్వాలతోనే సరిపోదు. ఇందుకు బాధ్యత ఉన్న ప్రతి పౌరుడూ చేయాతనివ్వాలి. అందుకే చాలా మంది సెలబ్రెటీలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

బిల్ గేట్స్ ఫౌండేషన్, జాక్‌ మా వంటి వ్యాపారదిగ్గజాలు సాయం అందిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడా సెలబ్రెటీలు తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. నటుడు నితిన్ 20లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఇప్పుడు మరో భారీ విరాళం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్ధాంగి అనుపమ కరోనా విపత్తుపై స్పందించారు.

కరోనా నివారణ కోసం అనుపమ తెలంగాణ ప్రభుత్వానికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. ఇలా ఇంకా చాలా మంది ప్రముఖులు కదలాల్సి ఉంది. ఎందుకంటే కరోనాతో పోరాటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.. జనం ఇళ్ల నుంచి కదలకుండా చేయాలి. ఇలా ఎంత కాలమో తెలియదు.

కనీసం నెల రోజుల వరకూ జనం సామాజిక దూరం పాటిస్తే తప్ప కరోనాను కట్టడిచేయడం సాధ్యం కాదు. అలాగే కరోనా టెస్టులు కూడా కాస్త ఖరీదైనవే. అందరికీ మందులు అందించాలి. లాక్ డౌన్ సమయంలో నిరుపేదల ఆకలి తీర్చాలి. ఇలా అన్నింటికీ డబ్బు ప్రధానం. ఈ సమయంలోనే దాతలు తమ పెద్ద మనసు చాటుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: