ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నాగబాబు విజ్ఞప్తి

Suma Kallamadi

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలయిన ఇటలీ, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో విదేశాల్లో ఉన్న మన భారతీయులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కొంత మంది తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. కానీ కొందరు అక్కడే చిక్కుకొని వారి ప్రాణాలను అరచేత పట్టుకుని బతుకుతున్నారు. ఇలాగే కొంత మంది తెలుగు వారు ఫారెన్‌ లో ఇరుక్కుపోయారు. అక్కడి వారు తిరిగి వారి సొంత ఊర్లకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోల ద్వారా వారు అక్కడ పడుతున్న కష్టాలను తీర్చమని ప్రభుత్వాలను కోరుతున్నారు. 


అయితే.. ఇప్పుడు తాజాగా ఇటలీలో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. అక్కడ తాము పడుతున్న తమ కష్టాలను చెప్పుకొన్నారు. భారత్ తో సహా విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకున్నారు. దీంతో ఎక్కడికి పోవాలో తెలియక అక్కడే ఉంటూ వారికి సరైన తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. అలాగే ఈ వీడియోలు చూసిన  జనసేన పార్టీ నేత నటుడు నాగబాబు ఇటలీలో ఇరుక్కున్న విద్యార్థులను కాపాడాలని ప్రభుత్వాలను కోరాడు. 


ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజల పిల్లలు 130 మంది విద్యార్థులు ఇటలీలో ఇరుక్కుపోయారని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారికి సాయం చేయాలని కోరారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక మార్గం చూసి విద్యార్థుల్ని కాపాడాలని వారిని కోరారు. ఒకవేళ ఏర్పాట్లు చేసి ఉంటే సంతోషమే అన్నారు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కాపాడటానికి తగిన ఏర్పాట్లు చేయాలని నాగబాబు ప్రభుత్వాలను కోరారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: