కరోనా పై యుద్ధం: లాక్‌డౌన్ పెంచేసిన కేసీఆర్..!
కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఒక్క రోజే 10 కేసులు నమోదయ్యాయని... మొత్తం 59 కేసులు నమోదు కాగా ఒకరికి కోవిడ్ 19 వ్యాధి నయం అయ్యింది అని, మిగతా యాభై ఎనిమిది మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. వీరు కాకుండా మరో 25 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు.
ఒకవేళ ఈ లాక్ డౌన్ ప్రకటించకపోతే కేసుల సంఖ్య వేల సంఖ్యలో ఉండేదని... ప్రజలు కూడా మంచిగా సహకారం చేస్తున్నారని చెప్పారు. లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూ లు ఎన్ని పెట్టినా 10 కేసు నమోదయినంటే... ప్రజలు ఇంకా స్ట్రిక్ట్ గా సోషల్ డిస్టెన్స్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ భయంకరమైన వ్యాధి గురించి ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిదని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాధికి మందు లేదు కాబట్టి స్వయం నియంత్రణ, పరిశుభ్రత పాటించటం లాంటివి కచ్చితంగా మనం చేసి కరోనా మహమ్మారిపై జేయిద్దామని ఆయన అన్నారు.
అలాగే ప్రధాన నరేంద్ర మోడీ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని చెబితే ఈయన ఇంకో రోజు పొడిగిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ... 'నేషనల్ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంది. మనమేమో మార్చి 31 వరకు పెట్టుకున్నాం. ఐతే మనం కూడా ఇప్పుడు మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు పొడిగించుకుంటున్నాం. గత్యంతరం లేదు ఇంట్లోనే కూర్చుదాం. ఇప్పటికే కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులలో మన రాష్ట్రంలోని ప్రజలు ఎక్కడ కూడా ఆకలికి గురి కాకూడదు. పేదవాళ్లు, యాచకులు తిండి పెట్టే కార్యక్రమం చేపట్టనున్నాం. వలస కూలీలకు కూడా ఆయా యజమానులను అన్నం పెట్టమని కోరాం. చాలామంది అలాగే చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయం లో ప్రజలు నిర్లక్ష్యం, అలసత్వంగా వహించడం సరికాదని తెలియజేస్తున్న' అని చెప్పారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple