కరోనా కట్టడి కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం... వారికి స్పెషల్ పాసులు..!
ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం తాజాగా పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూరగాయలు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులను వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.
కానీ కొన్ని ప్రాంతాలలో ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ జనాలు రోడ్లపైకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్ల అత్యవసర సేవల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాస్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
ఈ విధానం ద్వారా నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం కానుంది. ఆన్ లైన్ లో నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు దరఖాస్తు చేసి ఈ పాస్ పొందవచ్చు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నవారి ఫోన్ లేదా మెయిల్ కు అనుమతులను పంపిస్తుంది. ప్రభుత్వం ఒక కంపెనీలో పని చేసే 20 శాతం ఉద్యోగులకు మాత్రమే ఈ పాస్ లను పంపిణీ చేస్తుంది. వీరికి జిల్లా జాయింట్ కలెక్టర్ పాస్ లను జారీ చేస్తాడు.
ప్రభుత్వం జారీ చేసే పాస్ లు ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటాయి. క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే పాస్ లను చెక్ పోస్టుల దగ్గర సులభంగా తనిఖీ చేయవచ్చు. అధికారులు పాస్ లను ఎవరైనా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి పాస్ లు అవసరం లేదని అధికారులు స్పష్టతనిచ్చారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple