క‌రోనా పోవాల‌ని భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి రోజా ఏం చేసిందో తెలుసా...

VUYYURU SUBHASH

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా దెబ్బ‌తో అంద‌రూ విల‌విల్లాడి పోతున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముందు నుంచే సీరియ‌స్ ఆదేశాలు పాటించాల‌ని చెప్పారు. ముందుగా జ‌న‌తా క‌ర్ఫ్యూతో ప్రారంభ‌మైన మోదీ నిబంధ‌న‌లు ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ 14 వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక క‌రోనా త‌గ్గిపోవాల‌ని ఎంతో మంది ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నో ప్ర‌యోగాలు కూడా న‌డుస్తున్నాయి.

 

మ‌రి కొంద‌రు స్వాములు, ఆధ్యాత్మిక వేత్త‌లు సైతం పూజ‌లు, యాగాలు.. య‌జ్ఞాలు చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌లువురు స్వాములు పూజ‌లు.. యాగాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సైతం క‌రోనా మ‌హ‌మ్మారి ఈ ప్ర‌పంచం నుంచి పోవాల‌ని కోరుతూ పూజ‌లు చేశారు. ఆమె ప్రాథినిత్యం వ‌హిస్తోన్న చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ పూజ‌లు చేశారు.

 

పుత్తూరు శివాల‌యంలో ధ‌న్వంత‌రి యాగం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రోజాతో పాటు ఆమె భ‌ర్త ఆర్కే. సెల్వ‌మ‌ణితో పాటు బంధుమిత్రులు.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌లు పాల్గొన్నారు. క‌రోనా పోవాల‌ని... మ‌ళ్లీ ప్ర‌జ‌లు అంద‌రు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని ఆమె ఆకాంక్షించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: