నిజానికి చైనా దేశంలో అంతమంది చనిపోయారా...? చైనా తప్పుడు లెక్కలు చూపిస్తుందా...?

Suma Kallamadi

నిజానికి ప్రస్తుతం చైనాలో అసలు ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ విషయంలో చైనా నిజాలు బయటికి చంపడం లేదు అన్న  విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా అధికారికంగా తెలుపబడిన విధానంగా 81,518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇక మరణాల సంఖ్య 3,305 గా ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ మాత్రం కేవలం 40 వేల మందికి పైగానే మృతువార్త పడి ఉంటారు అనే వాదన వినిపిస్తోంది. కేవలం కవినిపించడమే కాదు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతుంది. 

 


ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్, ఇరాన్, అమెరికా దేశాలలో మృతుల సంఖ్య రోజురోజుకి బాగా పెరిగిపోతున్న అందులో కేవలం చైనాలో ఎందుకు లేదు అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత  నెల రోజులుగా చైనాలో కొత్త కేసుల ఏవి కూడా చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా అప్పటి నుంచి ఈ రోజు వరకూ 81వేల కేసులే ఎందుకు నమోదు అయ్యాయి, అలాగే కేసులు ఎందుకు రికవరీ అవ్వడంలేదు అన్న వాదన బాగా వినిపిస్తుంది.

 


ఇది ఇలా ఉండగా మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తప్పుడు లెక్కలు తెలుపుతుంది అని మరి కొందరు అంటున్నారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ ఒక అంటూ వ్యాధి అని ఆలస్యంగా కూడా తెలియచేసింది అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అన్ని దేశాలలో ప్రతి రోజు వైరస్ కేసులు అనేకంగా ఎక్కువ  అవుతుండంతో చాలా పెద్ద సమస్యగా మారింది. అంతే కాకుండా చైనాలో చనిపోయిన వారికి కింగ్మింగ్ పేరుతో ఓ పండుగ కూడా ఆ దేశంలో నిర్వహించారు. చితాభస్మం కుండల్ని పంపిణీ చేయడం కూడా ఆ కార్యక్రంలో జరిగింది. ఈ పండుగను మార్చి 23 నుంచి ఏప్రిల్ 4, 2020 వరకూ కూడా నిర్వహించబోతున్నారు అక్కడ. ఈ పండుగ సందర్భంగా.. ఇప్పటికే అక్కడ  42000 కుండల్ని వుహాన్‌ నగరం, హుబే ప్రావిన్స్‌ లో తెప్పించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: