ఏపీని క‌మ్మేసిన క‌రోనా... జ‌గ‌న్ తాజా డెసిష‌న్ ఇదేనా...!

Suma Kallamadi

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కమ్మేస్తున్న వేళ, మన దగ్గర అంతగా దాని ప్రభావం లేదని చంకలు గుద్దుకున్నాం... కానీ ఆ అనందం ఎంతో సమయం పాటు నిలవలేదన్న నిజం నేటితో అందరికీ అర్ధమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముస్లిం మత సమావేశాలైన "తబ్లిగి జమాత్" కార్యక్రమం... అగ్నికి ఆజ్యం పోసినట్లయింది... కేవలం ఈ సభకు హాజరైన వారితోనే ప్రస్తుత మన ఆంధ్ర రాష్ట్ర కేసులు రెట్టింపు అయినాయి.

 

సదరు కార్యక్రమంలో పాల్గొన్న 373 మందికి పరీక్షలు చేయగా.. అందులో 43 మందికి పాజిటివ్ అని తేలడం ఇపుడు అందరిలో కలకలం రేపుతోంది. దాంతో కొత్తగా ఈరోజు అత్యధికంగా కడపలో మరో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 13; చిత్తూరులో 5; ప్రకాశం 4; నెల్లూరు 2; తూర్పు గోదావరిలో 2;  కృష్ణా 1;  విశాఖ 1 ఇలా... మొత్తానికి ఈరోజు ఒక్కరోజే 43 కొత్త కేసులు బయలు పడటం.. దీనితో ప్రస్తుత కేసులు 87కు చేరడం ఇపుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.

 

గత 12  గంటల్లోనే జరిగిన ఈ మార్పు ప్రమాదపు సూచికగా కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో అని సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో... మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి... శ్రీ వైస్ జగన్ గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలోనే రివ్యూ మీటింగ్ జరుపుతున్నారు.

 

ముఖ్యంగా... ఢిల్లీ ముస్లిం సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి పూర్తి డేటాను సేకరించి.. వారందరిని వీలైనంత తొందరగా క్వారంటైన్ కు పంపించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సదరు సభలకు వెళ్లిన వారు స్వతహాగా క్వారంటైన్ కు రావాలని, లేని యెడల వారి పట్ల ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారు.. హెచ్చరించారు. అలాగే.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి... లాక్ డౌన్ విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం కూడదని సూచించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: