ఏప్రిల్ 1st 4 PM కరోనా బాధిత నెంబర్లు.. ఏపీ, తెలంగాణ టు వరల్డ్ వైడ్ నెంబర్లు ఇవే..
విశ్వ వ్యాప్తంగా... కరోనా కోరలు చాచుతున్నవేళ, మన దగ్గర.. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠతకు తెర తీస్తోంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి.. ఒక్కసారిగా కేసులు నమోదు కావడం ఇపుడు రక రకాల ఊహాగానాలకు తెర లేపుతోంది.
ఇక వారందరూ.... ఢిల్లీ తబ్లీగి జమాత్కు వెళ్ళినవారు కావడం గమనార్హం. పులివెందులకు చెందిన 7 మందిని, వేంపల్లె నుండి మరో 7 మందిని.. కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లుగా సమాచారం. అలాగే రాయచోటి నియోజకవర్గ పరిధినుండి.. ఢిల్లీ ముస్లిం సభలకు 16 మంది వెళ్లినట్లుగా అధికారులు ధృవీకరించారు. మరికొంతమంది ఆచూకీ... లేనందువలన అధికారులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం.
ఇక పొతే.. నేటితో కరోనా కేసులు 44 నుండి కాస్త, 87కి ఒక్కసారిగా చేరుకోవడం.. కలవర పెడుతోంది. ఒక్క కడప జిల్లాలోనే 15 కరోనా వైరస్ - కోవిడ్ 19 కేసులు నిర్ధారణ అవ్వడం ఒకింత బాధాకరం. అయితే ఇక్కడ కొత్తగా నమోదైన ఈ 15 కేసులు... ఢిల్లీ నుండి వచ్చినవే... అందువలననే ఈ ఢిల్లీ ముస్లిం సమావేశాలపైన సర్వత్రా.. విమర్శలు, అపోహలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కేసుల సంఖ్య క్రింది విధంగా వుంది......
ప్రపంచలో మొత్తం కేసులు: 8, 72 , 830
మరణాలు: 43, 271
రికవరీ కేసులు: 1, 84, 533
ఇండియాలో మొత్తం కేసులు: 1590
మరణాలు: 45
కొత్త కేసులు: 193
రికవరీ కేసులు: 148
తెలంగాణలో మొత్తం కేసులు: 97
మృతులు: 6
ఏపీలో మొత్తం కేసులు: 87
మృతులు: 1
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple: https://tinyurl.com/NIHWNapple