బిగ్ బ్రేకింగ్: ఏపీలో టాప్ ప్లేస్కు చేరువలో ప్రకాశం.... కొత్త కరోనా కేసులు..
ప్రపంచ దేశాలు కరోనా వేటకి అల్లాడిపోతున్నాయి. ఇక మన దేశంలో కూడా క్రమంగా పెరుగుతున్న కేసులు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే... మొన్న ఢిల్లీ ముస్లిం సభలు తబ్లీగి జమాత్ పుణ్యమాని... ఇక్కడ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అందుచేతనే.. రాష్ట్రంలో అసలు కేసులే నమోదు కానీ జిల్లాలు ఒక్కసారిగా.. రెట్టింపు కేసులతో ఇపుడు టాప్ ప్లేసుని ఆక్రమిస్తున్నాయి.
నిన్న సాయంత్రం వరకు మనం చూసుకుంటే.. జిల్లా వారీగా.. గుంటూరు 20; కృష్ణా 15; ప్రకాశం 15; కడప 15; పశ్చిమ గోదావరి 14; తూర్పు గోదావరి 9; విశాఖ పట్నం 11; చిత్తూరు 6; నెల్లూరు 3; అనంత పురం 2; కర్నూలు 1 గా నమోదు అయ్యాయి. అయితే... ప్రస్తుత సమాచారం మేరకు... చీరాలలో ఢిల్లీ వెళ్లిన వృద్ధుడి ద్వారా ఆయన భార్యకు ,కొడుకుకి కలిపి రెండు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రకాశం జిల్లాలో కేసులు 17కి చేరుకుంది.
ఇక సమాచారం లేని కేసులు పలు ఉండవచ్చనే అనుమానం ఇపుడు... ఇపుడు రాష్ట్రంలోనే కేసుల విషయంలో ప్రకాశం ముందు వరసలో వుండకపోదని విశ్లేషకులు చెబుతున్నారు. అందువలననే ఢిల్లీ కార్యక్రమం నుండి వచ్చిన వారిని జల్లెడ పట్టమని జగన్ నిన్న అత్యవసర మీటింగ్ లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత కేసుల సంఖ్య, ప్రకాశం జిల్లా వాసులని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నిన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ మీడియా వేదికగా మాట్లాడుతూ... ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందువలన మరోసారి ఆరోగ్య సర్వే గ్రామ గ్రామాలలో.. గ్రామ వాలంటీర్ సమక్షంలో పూర్తిస్థాయిలో చేయిస్తున్నామని, దానికి అందరూ సహకరించాలని స్పష్టం చేశారు. అలాగే.. ఢిల్లీ నుండి వచ్చిన వారు స్వతహాగా క్వారంటైన్ కు రావాలని సూచించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple: https://tinyurl.com/NIHWNapple