భార‌త్‌కు రూ.7600కోట్ల ఆర్థిక సాయం.. ప్ర‌పంచ బ్యాంకు భ‌రోసా..!

Spyder

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరు స‌లుపుతున్న భార‌త్‌కు ప్రపంచ‌బ్యాంకు బాస‌టగా నిలిచింది. భార‌త్ చేసిన అభ్య‌ర్థ‌న‌కు ప్ర‌పంచ బ్యాంకు వెంట‌నే స్పందించి 1బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయం అంద‌జేసేందుకు ముందుకురావ‌డం గ‌మ‌నార్హం. అత్య‌వ‌స‌ర సాయం కింద  భార‌త్ తో పాటు మొత్తం 25 దేశాల‌కు 1.9 బిలియ‌న్ డాల‌ర్లను అంద‌జేస్తోంది. ఇదులో అత్య‌ధికం భార‌త్‌కు 1 బిలియ‌న్ డాల‌ర్లు ( సుమారు 7600కోట్లు) ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. భారత్‌ తర్వాత.. పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 

 

ఈ మేర‌కు గురువారం జరిగిన బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు.  స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్‌, వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌, నూతన ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు ఈ నిధులు ఖ‌ర్చు చేయ‌నున్నారు. దక్షిణాసియాలో  ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెలల్లో 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికలు త‌యారు చేస్తున్న‌ట్లుగా  ప్రపంచ బ్యాంకు ప్ర‌క‌టించింది.  ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేదలను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని స్ప‌ష్టం చేసింది.

 

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు అభినందించింది. భార‌త్‌కు అవ‌స‌ర‌మైతే మ‌రింత ఆర్థిక సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని బ్యాంకు అధికారులు భ‌రోసానిచ్చారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు  భారత్‌లో 2500 {{RelevantDataTitle}}