కరెన్సీ నోటు నాకి, చీది భయపెట్టాడు.. చివరికి!?
వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఎంతోమందికి వ్యాపించి వారిని పీక్కతింటుంది.. ఎన్నో వేలమంది ప్రాణాలను బాలి తీసుకున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అని లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. అలాంటి ఈ సమయంలో కరోనా వైరస్ పై ఓ వ్యక్తి చేసిన పని అసహ్యించుకునేలా ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ కరోనా వైరస్ ఎంత డేంజర్ అనేది ఇప్పటికి అర్థం కావడం లేదు.. ఇళ్లలో ఉండండి రా.. బయటకు రాకండి రా అని నెత్తినోరు మొదుకున్న కొందరు బయటకు వస్తున్నారు.. బయటకు రావడం పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లోనే ఉండి సోషల్ మీడియాలో అతి చేస్తున్నారు.. నకిలీ కరోనా వైరస్ వార్తలు సృష్టిస్తున్నారు.. భయపెట్టే సమాచారం.. ఫోటోలు.. వీడియోలు సృష్టించి అతి చేస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి నాసిక్‌లో సయ్యద్ జమీల్ సయ్యద్ బాబూ కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. వ్యాక్సిన్ లేని నావెల్ కరోనా వైరస్ ''దేవుడి శాపం'' అంటూ టిక్‌టాక్‌లో ఓ వీడియో అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోను చూస్తే కరోనా లేని వాళ్ళు కూడా వస్తుందేమో అని బయపడి ఆత్మహత్య చేసుకునేలా ఆ వీడియో ఉంది.
దీంతో మాలెగావ్ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు. ''కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది'' అంటూ పోలీసులు వెల్లడించారు.
అంతకు ముందు కూడా ఓ నీచుడు అత్యవసర సర్వీస్‌కు ఫోన్ చేసి సమోసాలు తీసుకొస్తారా అని అడిగి అవమానించాడు.. దీంతో మారేవారు అలాంటి చెత్త పనులు చెయ్యకుండా అతనితో పోలీసులు మురికి కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయించి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసింది.. అందుకేనయ్యా.. ఇప్పటికైనా మీ చెత్త పనులు అపాండి... బాధ్యత గల పౌరుడిలా వ్యవహరించండి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple