స్పూర్తి దీపం : జగన్ అలా - కేసీఆర్ ఇలా ..!

Reddy P Rajasekhar

ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. మోదీ ఇదే సమయంలో జాతిలో ఐక్యత తీసుకొనిరావాలనే ఉద్దేశంతో ఈరోజు రాత్రి ప్రతి ఇంట్లో 9 గంటలకు లైట్లన్నీ ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.  కుల, మత బేధం లేకుండా ప్రతి ఒక్కరూ కరోనాపై పోరుకు స్పూర్తినిస్తూ ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. 
 
ప్రధాని మోదీ పిలుపు గురించి సీఎం జగన్, సీఎం కేసీఆర్ స్పందించారు. ఈరోజు రాత్రి 9 గంటలకు వెలిగించే దీపాలు మన సమైక్యత చాటి చెప్పాలని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ దీపాలు వెలగాలని అన్నారు. చీకటి నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, టార్చ్ లు, మొబైల్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తీసుకురావాలని సూచించారు. 
 
ప్రధాని మోదీ పిలుపుకు సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. కేసీఆర్ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని కోరారు. కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని చెప్పారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్పూర్తిమంతంగా సాగాలని అన్నారు, 
 
మోదీ ఇచ్చిన పిలుపుపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ విధించిన తరువాత ప్రధాని మోదీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి, తలుపులు మూసేసి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రపంచానికి ఒక సందేశం వెళుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. మోదీ ఇచ్చిన పిలుపుకు అన్ని చోట్ల నుంచి మద్దతు లభిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: