చరిత్రలో ఈరోజు : 06-04-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

ఏప్రిల్ 6వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి  ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 ఉప్పు సత్యాగ్రహం : 1930 ఏప్రిల్ 6వ తేదీన మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లో ఉప్పు  చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమం నుంచి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు మహాత్మాగాంధీ. ఈ యాత్రనే ఉప్పుసత్యాగ్రహం గా ప్రసిద్ధి గాంచింది. 

 

 జేమ్స్ వాట్సాన్  జననం  : డిఎన్ఏ  కనుగొన్నా ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ 1928 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు.

 

 దిలీప్ వెంగ్సర్కార్ జననం : భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు అయిన దిలీప్ వెంగ్సర్కార్ 1956 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. మహారాష్ట్ర లో జన్మించిన దిలీప్ వెంగ్సర్కార్ ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టు క్రీడాకారుడుగా  కొనసాగారు. అంతే కాకుండా భారత జట్టు సెలక్షన్ కమిటీలో కూడా విధులు నిర్వహించారు దిలీప్ వెంగ్సర్కార్. డ్రైవ్ కొట్టడంలో బాగా నేర్పరి ఈ బ్యాట్స్మెన్. 1976లో న్యూజిలాండ్ తో  జరిగిన అంక్లాండ్  టెస్ట్ ద్వారా ఓపెనర్గా భారత జట్టులోకి ప్రవేశించాడు.

 

 సామ్రాట్ రెడ్డి జననం  : తెలుగు ప్రేక్షకులందరికీ సామ్రాట్ రెడ్డి కొసమెరుపు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సామ్రాట్ రెడ్డి... విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతగానో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు సామ్రాట్ రెడ్డి. ఈయన 1983 ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. మోడల్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు  చాలా సినిమాల్లో నటించారు సామ్రాట్ రెడ్డి. తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించిన బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా  వెళ్లారు. అక్కడ కూడా తన దైన ఆటిట్యూడ్తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించారు సామ్రాట్ రెడ్డి. చివరి ఫైనల్ వరకు వెళ్ళిన సామ్రాట్ రెడ్డి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 

 

 ఆదిత్య మీనన్ జననం  :  ప్రముఖ భారతీయ నటుడు అయిన ఆదిత్య మీనన్  1974 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. ఎక్కువగా తమిళ మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆదిత్య మీనన్ . తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన కొసమెరుపు . తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా విలన్ పాత్రలో నటించారు ఆదిత్య మీనన్ . కేవలం విలన్ పాత్రలే కాకుండా విభిన్నమైన  పాత్రలో నటిస్తూ  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

 

 నల్లమల గిరిప్రసాద్ జననం  : ప్రముఖ కమ్యూనిస్టు నేత అయినా నల్లమల గిరిప్రసాద్ సాయుధ  తెలంగాణ పోరాట యోధులు. కమ్యూనిస్టు నేతగా ప్రజల్లో చైతన్యం కల్పించే సాయుధపోరాటానికి ప్రజలందరూ నడుం బిగించేలా ఎంతగానో చైతన్య పరిచిన వ్యక్తి నల్లమల గిరిప్రసాద్. ఆయన 1931 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు.

 

 సుజాత మరణం : ప్రముఖ మలయాళ నటి అయిన సుజాత 2011 ఏప్రిల్ 6వ తేదీన మరణించారు. తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో చలనచిత్రాలలో నటించి సుప్రసిద్ధ దక్షిణ భారత నటిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధ పడిన ఈమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: