మహారాష్ట్రలో మరణ మృదంగం... భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య...?
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 781కి చేరింది. దేశంలో కరోనా భారీన పడి ఇప్పటివరకు 109 మంది చనిపోయారు. వీరిలో 45 మంది మహారాష్ట్రకు చెందిన వారు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ముంబాయి, పుణెలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
రాష్ట్రంలో ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైన వారు ఎక్కువ మంది కరోనా భారీన పడ్డారు. మహారాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ఎక్కువగా అసత్య వార్తల ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ఱంలో ఈరోజు కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 266కు పెరిగింది. కృష్ణా, అనంతపురం జిల్లాలలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు కొత్త నిబంధనలను రాష్ట్రాల్లో అమలులోకి తెస్తున్నాయి.