కరోనా బాధితుడు ఎవరి మీదైనా ఉమ్ము వేస్తే... మర్డర్ అట్టెంప్ట్ కిందే లెక్క..!

Suma Kallamadi

కంటి చూపుతో కాదు రా! ఉమ్మేసి చంపేస్తా అంటున్నారు చాలామంది మానవత్వం లేని కరోనా పీడితులు. మొన్నీమధ్య థాయిలాండ్ కు చెందిన ఓ 56 ఏళ్ల వ్యక్తి తాను ఎక్కిన ట్రైన్లోని ప్రయాణికుల మీద ఉద్దేశపూర్వకంగానే ఉమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాడు. ఆ సమయంలో తానేదో మానవబాంబు అయినట్టు ప్రతి ఒక్క ప్రయాణికుడు భయంభయంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమయాన్ని గడిపారంటే అతిశయోక్తి కాదు. మనదేశంలో తబ్లీజీ జమాత్ వేడుకలో పాల్గొని వైరస్ అంటించుకున్న బాధితులు కూడా... వారిని పట్టుకొని వ్యాన్లో పడేసిన పోలీసులపై, చికిత్స అందిస్తున్న వైద్యులపై కావాలనే ఉమ్మేస్తున్నారు. ఒకడేమో ఏకంగా కరెన్సీ నోట్లకే ఉమ్ము రాసి, చిమిడి తుడిచి ప్రజలందరికీ కరోనా వైరస్ సోకేలా చేస్తున్నాడు. ఇది ఎంత దారుణమైన చర్యనే మాటల్లో వర్ణించలేం.


వాస్తవానికి ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు సోకేలా చేయడమనేది... వారికి విషమిచ్చి చంపినట్టే. న్యాయపరంగా మాట్లాడుకుంటే హత్యాయత్నం/ హత్యాప్రయత్నానికి ఒడిగట్టినట్లే. అదే ఒకవేళ ఉమ్ము వేయించుకున్న వ్యక్తి కోవిడ్ 19 వ్యాధితో చనిపోతే... ఉమ్మివేసిన నిందితుడు హత్య చేసినట్టే. ఈ విషయాలను హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్ఆర్. మార్డీ తాజాగా వెల్లడించారు.


ఆయన మాట్లాడుతూ... కరోనా సోకిన వ్యక్తి కరోనా సోకని ఆరోగ్యకరమైన వ్యక్తి పై ఉమ్మివేస్తే... ఆ కరోనా బాధితుడిని హత్యాయత్నం(మర్డర్ అటెంప్ట్) కింద అరెస్టు చేస్తామని, ఒకవేళ ఉమ్మి పడిన వ్యక్తి కరోనా వైరస్ సోకి చనిపోతే... ఉమ్మి వేసిన వ్యక్తిని మర్డర్ కేసు కింద అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇటువంటి కఠినమైన రూల్స్ లేకపోతే కరోనా సోకిన ప్రతి వ్యక్తి అమాయక ప్రజలపై ఉమ్మి వేస్తారని, దాని వల్ల ఎంతో ప్రాణ నష్టం వాటిల్లుతుందని డీజీపీ తెలిపారు. వైద్యం చేయించుకొండి రా నాయనా అంటే... ఏకంగా పోలీసులు వైద్యుల మీదనే ఉమ్మేస్తూ ప్రతి ఒక్కరి ఆగ్రహానికి గురి అవుతున్న వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీపీ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఎవరైనా ఉమ్ము వేస్తే వారిపై మర్డర్ అట్టెంప్ట్ కింద కేసులు నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: