బాబోయ్‌ కరోనా : ప్రపంచ భవిష్యత్ 1930 నాటి కరువు కంటే దారుణంగా ఉంటుందా..?

Chakravarthi Kalyan
కరోనా.. ఇప్పుడు ప్రపంచ మానవాళి ముందు ఉన్న పెద్ద సవాల్.. ఇది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇది 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీస్తోందని ఐఎంఎఫ్ ఇప్పటికే హెచ్చిరించింది. అయితే అది కూడా చాలా తక్కువే అని.. కరోనా ప్రభావం 1930 ల నాటి ఆర్థిక సంక్షోభాన్ని తలపించే ప్రమాదం ఉందని మరి కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే ఒక్కటి మాత్రం నిజం.. మానవాళి ఇప్పటి వరకూ ఎదుర్కొన్న అతి పెద్దసంక్షోభాల్లో కరోనా అగ్రభాగాన నిలిచే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంక్షోభం మానవాళి మునుపెన్నడూ ఎదుర్కోలేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో వచ్చిన సంక్షోభాలు ఏదో ఒక రంగాన్ని ప్రధానంగా ప్రభావితం చేశాయి. కానీ కరోనా.. అలా కాదు.. ఇది అన్ని రంగాలపైనా దాని ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కరోనా ప్రభావం కనిపించని రంగాలే లేవు.

అంతే కాదు. గతంలో వచ్చిన అనేక సంక్షోభాలు ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి ప్రభావితం చేయలేదు. ప్రపంచంలోని కొన్ని దేశాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దాని ప్రభావం ప్రపంచంపై పడింది. అదే సమయంలో కొన్ని దేశాలు ఆ ప్రభావాన్ని తప్పించుకున్నాయి కూడా. ఉదాహరణకు 2008 నాటి ఆర్థిక మాంద్యం ప్రభావం అమెరికా వంటి దేశాలపై కంటే ఇండియాపై తక్కువే.

కానీ కరోనా పరిస్థితి అలా కాదు.. ఒక దేశం కాదు.. ఒక ఖండం కాదు.. అసలు కరోనా ప్రవేశించని దేశాలే లేవు. ఇలా ప్రపంచం మొత్తాన్ని ఏక కాలంలో సంక్షోభంలోకి నెట్టేసిన దారుణం గతంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు. ఈ కరోనా ప్రభావం ఎంత కాలం ఉంటుంది.. ఎప్పుడు దీని బారి నుంచి బయటపడుతుందన్నది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. అందుకే జనం కష్టకాలానికి మానసికంగా సిద్ధం కావాల్సిందే.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: