కేసీఆర్ ప్రసంగాలకు ఏపీ పడిపోయిందా...?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా వింటున్నారు. తెలంగాణాలో కరోనా కేసుల విషయంలో అయన మాట్లాడే మాటలు దేశానికి ఇచ్చే సలహాలు అన్నీ కూడా ఇప్పుడు ఆసక్తిగా ఉన్నాయి. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడా కూడా తడబడకుండా ఆయన లెక్కలు చెప్పడం చూసి ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. 

 

కేసీఆర్ ని ఒకప్పుడు తిట్టిన వాళ్ళు కూడా ఆయన మాటలు విని ఫిదా అయిపోతున్నారు. ప్రతీ విషయాన్ని కూడా కేసీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. అంతే కాకుండా దేశ ప్రజలకు కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణా ఆదాయం పడిపోతున్నా అవసరం అయితే నాలుగు రోజులు ఇబ్బంది పడదాం అని అంటున్నారు. 

 

అంతే గాని లాక్ డౌన్ ని మాత్రం కొనసాగించాలి అని కేసీఆర్ పట్టుధలగానే ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తెలంగాణా ప్రజలను ఆయన లాక్ డౌన్ విషయంలో మానసికంగా సిద్దం చేసారు కూడా. పరిస్థితిని ప్రజలకు చాలా జాగ్రత్తగా అర్ధమయ్యే విధంగా చెప్పారు. ప్రతీ విషయాన్ని కూడా ఆయన పర్యవేక్షించడమే కాదు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తూనే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమయ్యే విధంగా చెప్తున్నారు. దీనిపై ఏపీ లో కూడా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి, ఏపీ సిఎం జగన్ ప్రసంగం ఆ స్థాయిలో ఉండాలని అందరూ కోరడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: