నిజంగా నీ ప్లాన్ సూపర్ గురూ...! మీరు కూడా ఇలానే ఫాలో అయిపోండి...!
కరోనా పుణ్యమా అని ప్రస్తుతం అనేక దేశాల్లో లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అన్నిరకాల వేడుకులను సన్నిహితులు, స్నేహితులతో జరుపుకునే వీలు ఇప్పుడు లేకుండా పోయింది. దీనితో క్వారంటైన్ లో ఉన్న కొంతమంది వారి శుభకార్యాలని వినూత్నంగా చేసుకుంటున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ దెబ్బతో ముఖ్యంగా బర్త్ డే వేడుకలను కాస్త వెరైటీగా, కాస్త ఫన్నీగా సెలబ్రెట్ చేసుకుంటున్న వీడియోలు మాత్రం మాములుగా నవ్వులని పూయించట్లేదు.
no one:
april may and june birthdays: pic.twitter.com/1IjwBpKYxf — v (@digbickvibes) April 5, 2020
ఇలాంటిదే ప్రస్తుతం ఒక వ్యక్తి వినూత్నంగా బర్త్ డేను జరుపుకున్న టిక్ టాక్ వీడియోను మంగళవారం ట్విటర్ లో ఖాతాలో షేర్ చేశారు. అయితే సదరు వ్యక్తి ‘ఎవరూ లేరు.. ఏప్రిల్, మే, జూన్’ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ వీడియో లో ఉన్న ఒక వ్యక్తి ఫేస్ మాస్క్ ను ధరించి తన బర్త్ డే కేక్ ముందు కూర్చోగా, కొంతమంది తన వారు బర్త్ డే పాట పాడుతుండగా హేర్ డ్రయ్యర్ తో క్యాండిల్స్ ను ఆర్పేశాడు.
అయితే ఇక్కడే అసలు విషయం ఏమటంటే... ఇక తన కెమారాను అతిథుల వైపు తిప్పగానే.. వారంతా వీడియో కాల్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్నట్లు అక్కడ కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటి వారికి 2.7 మిలియన్ల వ్యూస్, అలాగే వేలల్లో లీకు లు వచ్చాయి. ఇంకా వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.