ఆంధ్రప్రదేశ్ @ 348 కరోనా కేసులు ... నేడు కొత్తగా 19 పాజిటివ్ కేసులు ...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ పరంగా మొత్తంగా ఉదయం 9 నుంచి జరిగిన కరోనా వైరస్ పరీక్షల్లో కొత్తగా గుంటూరు జిల్లాలో 8, అనంతపూర్ జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో- 3, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరింది.
ఇక కర్నూలు జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తెలిపారు. దీనితో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 75 కి చేరింది. అలాగే ఇక అనంతపురం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు DMHO అనిల్ కుమార్ తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం నలుగురు వైద్య సిబ్బందికి సైతం ఈ మహమ్మారి సోకినట్టు నిర్దారణ జరిగిందని ఆయన తెలిపారు.
#CovidUpdates: రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది. #APFightsCorona #Covid pic.twitter.com/d6NirKofh9 — ArogyaAndhra (@ArogyaAndhra) April 8, 2020
కర్నూలు జిల్లాలో గత శనివారం వరకు కేవలం నాలుగుగా ఉన్న కరోనా వైరస్ కేసులు ఒక్క సారిగా అమాంతంగా 75 కి పెరిగిపోయాయి. దీంతో బుధవారం సాయంత్రానికి కర్నూలు జిల్లాలో మొత్తం రెడ్ జోన్లను ఏర్పరిచి వాటికి జియో ట్యాగింగ్ చేసి పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని జిల్లా మొత్తం ఉంచారు. అయితే ఇందులోని కేసుల్లో అధిక శాతం ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇక కరోనా కేసులు జిల్లా వ్యాప్తంగా చూస్తే...
అనంతపూర్ - 13
చిత్తూర్ - 20
ఈస్ట్ గోదావరి - 11
గుంటూరు - 49
కడప- 28
కృష్ణ - 35
కర్నూలు - 75
నెల్లూరు - 48
ప్రకాశం - 27
శ్రీకాకుళం - 0
విశాఖపట్నం - 20
విజయనగరం - 0
వెస్ట్ గోదావరి - 22