జేసీ బీజేపీలోకి వెళ్తున్నారా...?  సీఎం రమేష్ అందుకే  భేటీ అయ్యారా..?

Spyder

అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీలోకి లాగేసేందుకు అధిష్ఠానం ప్ర‌య‌త్నం చేస్తోందా..? అందుకే రాయ‌బారాలు మొద‌లుపెట్టిందా..? అంటే సీమ రాజ‌కీయ వ‌ర్గాలు చెప్ప‌లేం అవ‌కాశం ఉంది అంటూ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి. ఓ వైపు క‌రోనాతో రాజ‌కీయం స‌ద్దుమ‌ణిగిన వేళ జేసీ దివాక‌ర్‌రెడ్డి విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఇదిలా ఉండ‌గా గతంలో కొన్నిసార్లు జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారతారంటూ వార్తలు విష‌యం తెలిసిందే.  అయితే ప్రతిపక్ష టీడీపీలో ఉంటే, జగన్ తమను మరింత టార్గెట్ చేయవచ్చని భావించిన కొందరు నేతలు కమలం గూటికి చేరారని, అలాగే, జేసీ కూడా అదే బాటలో నడుస్తారనే ప్రచారం జరిగింది. 

 

ఇప్పుడు ఏకంగా సీఎం రమేష్ జేసీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఫాం హౌస్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి స‌మావేశంతో ఈ రాజ‌కీయ అనుమానాలు మొద‌ల‌య్యాయి. జేసీతో వీరిద్ద‌రి భేటీ కావ‌డంతో రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది. దివాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వారిద్దరూ వచ్చారని జేసీ  అనుచరులు చెబుతున్నా...అసలు విష‌యం మాత్రం అది అయి ఉండ‌ద‌ని కొంత‌మంది రాజ‌కీయ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. జేసీతో కొద్దిసేపు ఫాం హౌస్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా మాట్లాడిన త‌ర్వాత  సీఎం ర‌మేష్‌, బీటెక్ ర‌వి వెళ్లిపోయార‌ని తెలుస్తోంది. 

 

 ప్రస్తుతం కరోనా మహమ్మారి గురించి, వ్యవసాయ రంగం గురించి చర్చించినట్టు జేసీ అనుచ‌రులు మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండ‌గా జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన జేసీ ట్రావెల్స్ మీద ఇటీవల ఏపీలో ఆర్టీఏ దాడులు ముమ్మరంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున బస్సులను సీజ్ చేశారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి ఏపీకి తీసుకొచ్చారని అధికారులు ఆరోపిస్తూ కేసులు కూడా న‌మోదు చేశారు. పోలీసులను తిట్టారనే ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదయ్యాయి. జేసీ దివాకర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేటాయించిన గనులను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేయ‌డం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: