కరోనా ఎఫెక్ట్  :  ఫార్మా కంపెనీలకు ఎన్నో సవాళ్లు.. !

NAGARJUNA NAKKA

కరోనా ఎఫెక్ట్ ఫార్మా కంపెనీల ప్రొడక్షన్‌పై ప్రభావం చూపుతోంది. తెలంగాణలోని ఫార్మా కంపెనీలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ప్రధానంగా ముడిసరకుల రవాణాతో పాటు ప్రొడక్షన్‌లో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి ఫార్మా కంపెనీలు.  

 

దేశంలో తెలంగాణ ఫార్మా హబ్ గా ఉంది. దేశం నుంచి విదేశాలకు జరిగే ఎగుమతుల్లో తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు ఉంటాయి. కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్ వివిద రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ ఫార్మా రంగంపై కూడా ఉంది. తెలంగాణలోని ఫార్మా కంపెనీలకు చైనా నుంచి ముడిసరుకు ఎక్కువగా వస్తుంటుంది .ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ముడిసరకు దిగుమతి పై ప్రభావం చూపుతోంది .చైనా నుంచి కార్గో ఫ్లైట్ లలో ముడిసరకు డిమాండ్ కు తగ్గట్టుగా వచ్చే పరిస్థితులు లేవు.ఇటు దేశానికి చేరుకున్న తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ ...అక్కడి నుంచి ఫార్మా కంపెనీలకు చేర్చేందుకు అనేక సవాళ్లు ఎదురువుతున్నాయి. లారీలు పూర్తి స్థాయిలో నడవకపోవడం ...లాక్ డౌన్ తో లారీ డ్రైవర్లు విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు .మరికొంత మంది డ్రైవర్లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు .ఇటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ముడి సరకు తీసుకురావడంలో కూడా సమస్యలను ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. 

 

ఫార్మా ఉత్పత్తులు కాబట్టి... పలు కంపెనీలు మూడు షిప్టులు నడుస్తాయి.లాక్ డౌన్ కారణంతో కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధుల్లోకి రాలేకపోతున్నారు. ఇటు ఈ కంపెనీల్లో కాంట్రాక్ట్ లేబర్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ప్రొడక్షన్ పై ప్రభావం చూపుతోంది .కరోనా ఎఫెక్ట్ తో విధుల్లోకి రావడానికి ఫార్మా కంపెనీల్లో పనిచేసే సిబ్బంది ఒకటికి రెండు సార్లు అలోచించే పరిస్థితి. మొత్తంగా ఈ సవాళ్లతో ఫార్మా కంపెనీల ప్రొడక్షన్ పై ప్రభావం చూపుతోంది.

 

తెలంగాణలో ఫార్మా కంపెనీల కార్యకలపాలు సాఫీగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఫార్మా కంపెనీల ప్రొడక్షన్‌పై ప్రభావం చూపుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: