అయ్య బాబోయ్...! అమెరికాకు వెళ్లనంటున్న అమెరిక‌న్లు..!

Suma Kallamadi

అయ్య బాబోయ్... మేము ఇప్పట్లో అమెరికాకు వెళ్లము అని అమెరికా పౌరులు లబోదిబో అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ విదితమే. అయితే అమెరికా దేశ పౌరులు ఏఏ దేశాల్లో ఆగిపోయారో వారిని తమ దేశానికి తిరిగి రప్పించుకునేందుకు అమెరికా ప్రత్యేక విమానాల ద్వారా వారిని తీసుకు వెళుతుంది. ఇప్పటికే ఇందులో భాగంగానే అమెరికా దేశం మొత్తం 50 వేల మందిని విమానాల్లో తన దేశానికి వారి పోరులని పిలిపించుకుంది. అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం భారత్ లో ఉన్న అమెరికన్లలో చాలా మంది మాత్రం తమ దేశానికి వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం అమెరికాకు వెళ్లి ఇబ్బంది పడే కంటే ఇండియాలోనే సురక్షితంగా ఉండటం ఉత్తమం అని వారు భావించారు. దీనితో వారు అమెరికాకి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు.

 


అయితే ప్రస్తుతం భారతదేశంలో అమెరికాకు చెందిన మొత్తం 24 వేల మంది ఇక్కడే ఉండిపోయారు. అయితే మొదటి విడతగా అమెరికా తమ పౌరుల్ని భారత్ నుండి తీసుకుపోవడానికి  మొదటి దశలో ఎనిమిది వందల మందిని కోరగా అందులో కేవలం పది మంది మాత్రమే ముందుకు వచ్చారంట. ఈ పరిస్థితి చూస్తే అమెరికా పౌరులు తమ దేశం పేరు చెబితేనే వణికిపోతున్నారు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ అమెరికా వాసులు భారతదేశంలోని కొద్ది కాలం గడపాలని వారు అనుకుంటున్నారు.

 


ఇక అలాగే UK పౌరులు భారతదేశంలో ఏకంగా 35 వేల మంది ఉండగా వారిలో కేవలం 20 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆ దేశ పౌరులు కూడా అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేరని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ బాధ కాస్త తగ్గాక వీరందరూ వారివారి విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: