మేమిద్దరం డేటింగ్ లో లేము.. కానీ..?
సిని సెలబ్రిటీల లవ్ స్టోరీస్ అంటే మీడియా కు పండగ అన్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీల లవ్ స్టోరీ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. అందుకే ఎప్పుడూ సినీ సెలబ్రిటీల ప్రేమాయణం గురుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. మరికొన్నిసార్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వచ్చిన ప్రేమాయణ వార్తలు నిజమైతే కొన్నిసార్లు మాత్రం అవి పుకార్లు గానే మిగిలిపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో గత కొంత కాలంగా ఓ సెలబ్ లవ్ గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా గత కొంత కాలంగా జహీర్ ఇక్బల్ తో డేటింగ్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇక ఈ వార్తలు రోజుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి . రోజుకో రకమైన వార్త సోషల్ మీడియాలో వీరి ప్రేమాయణం గురించి హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా వీరి ప్రేమాయణం గురించి నటుడు జహీర్ ఇక్బల్ స్పందిస్తూ... వీరి లవ్ స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చాడు. నేను సోనాక్షి సిన్హ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాము అంటూ వస్తున్న వార్తలను మేము ఎప్పుడూ చదువుతూనే ఉంటాము అంటూ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ వచ్చిన వార్తలను చదివి ఎంతగానో నవ్వుకున్నామని ... అయితే ఇది నా మొదటి రూమర్ అని అందుకే దీనిపై ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
తరచూ మేము ఇద్దరం కలిసి పార్టీలకు వెల్లె వాళ్ళమని తెలిపిన జహీర్ ఇక్బల్... తాము కలిసి ఉండడాన్ని ఎక్కువ సార్లు చూసిన వారందరూ తామిద్దరం డేటింగ్లో ఉన్నామంటూ భావించి ఇలాంటి వార్తలను ప్రచారం చేసి ఉంటారని తెలిపారు. అయితే మా మధ్యలో ప్రేమ ఉందని డిసైడ్ అవ్వడం కాదు ఏముందో తెలుసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. లవ్ స్టోరీ ఉందని ఇద్దరం డేటింగ్ లో ఉన్నాము అంటూ వస్తున్న వార్తలను చూసి సోనాక్షి తాను ఎన్నోసార్లు చర్చించుకున్నాము... కానీ అందరికీ తెలియని విషయం మరొకటి ఏమిటి అంటే ఇప్పటికే నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను అంటూ తెలిపారు. ఈ మ్యాటర్ సోనాక్షి సిన్హా కూడా తెలుసు .. మా ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అంటు వస్తున్న వార్తలపై సోనాక్షికి తెలిసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం అయితే తాను సింగిల్ గానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు జహీర్ ఇక్బల్ .