ఇకపై మాస్క్ లేకపోతే నిత్యావసరాలు కట్ ...!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ దెబ్బకి లాక్ డౌన్ నిదానం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో భారతదేశంలోని ప్రజలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అయితే కొన్ని రంగాల్లో చెందినవారు మాత్రం వారి వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు నివారణ మార్గాలను తెలియజేస్తూ వస్తున్నారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ అభివృద్ధి చెందకుండా ఉండడం కోసం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మే 3 వ తారీఖు వరకు కొనసాగించారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని సూచనలు ఇస్తున్న కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లా అధికారులు ప్రజల తాట తీస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించండి లేని పక్షంలో వారికి నిత్యవసర వస్తువులు విక్రయించవద్దని సదరు షాప్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇప్పటికే బలరాంపూర్ అధికార యంత్రాంగం జిల్లాలోని మొత్తం దుకాణాల ఓనర్లలందరికీ ఈ ఆదేశాలను జారీ చేశారు. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరైతే మాస్కు ధరించని వారికి వస్తువులను విక్రయించ రాదని పూర్తిగా స్పష్టం చేసింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక దూరం కఠినంగా పాటించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మెడికల్ షాపులు, కిరాణా షాపులో, పెట్రోల్ బంకులు అలాగే గ్యాస్ ఏజెన్సీలు ఇంకా విత్తన షాపులు సహా అన్ని ఇలాంటి విధానాన్ని కచ్చితంగా అమలు పరచాలని వారికి ప్రభుత్వం హెచ్చరించింది.
అయితే ఈ విషయాన్ని ఎస్పీ దేవరంజన్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ ఆదేశాలను కనుక ఎవరైనా అతిక్రమిస్తే వారి దుకాణాల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇది ఇలా ఉండగా మాస్కులు ధరించని 11 మందిని లక్నో నగరంలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అరెస్టు చేసిన వారి చేతులు స్యానిటైజ్ చేసి వారితో మాస్కులు ధరింపజేశాం అని ఆయన తెలిపారు.