చంద్రబాబు అలా..! జగన్ ఇలా..? - సీఎంగా ఎవరి మార్కు ఏంటి...?

Chakravarthi Kalyan
పరిపాలనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్.. ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కో పాలకుడు ఒక్కోలా స్పందిస్తారు. ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏమైనా విపత్తులు వస్తే.. ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. నిరంతర సమీక్షలు, రివ్యూలు, అధికారులపై ఆగ్రహం... మీడియా కవరేజ్‌ అంతా ఓ రేంజ్‌లో ఉండేవి.. ఇప్పుడు జగన్ ఇందుకు పూర్తి భిన్నం.

జగన్ సైలంట్ గా పని చేసుకుపోతుంటారు. హడావిడి ఉండదు. ఈ ఇద్దరు పాలకుల మధ్య తేడాని వివరిస్తున్నారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమంటున్నారంటే.. " అప్పట్లో చంద్రబాబు చేసిందేమిటి?.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపత్తులు వస్తే ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు.. చంద్రబాబు చేసింది తక్కువ..ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా తప్పులు జరిగితే అధికారుల మీద తోసి వేయడం, మంచి జరిగితే ఆయన ఖాతాలో వేసుకోవడం చూశామన్నారు.

హుద్ హుద్ తుపాను వస్తే చంద్రబాబు ప్రచారం కోసం విశాఖలో కూర్చుంటే అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారని సజ్జల గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల సమయం ఏడాది ముందే తెలిసినా, చివరి నిమిషం వరకు పనులు చేయకుండా, ఆ తర్వాత నామినేషన్ పద్దతిలో కోట్ల రూపాయల పనులు కేటాయించారని విమర్శించారు.

అదే సమయంలో సజ్జల జగన్ పని తీరునూ వర్ణించారు. వైయస్‌ జగన్ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారని... ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వ్యవస్థలు పనిచేయాలని కోరుతున్నారన్ని సజ్జల తెలిపారు. అధికారులకు దిశానిర్దేశం చేసి, స్వేచ్చగా పని చేసే వెలుసుబాటు కల్పించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇలాంటివి వైయస్‌ జగన్‌ ప్రచారానికి వాడుకోరని తెలిపారు. గంటల కొద్ది మీడియా సమావేశాలు పెట్టి సమయం వృథా చేయడం సిఎంకు ఇష్టం ఉండదన్నారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ తాను చేయవలసిన పనులు అన్నీ చేశారని, కంట్రోలింగ్ మెకానిజం, హెల్ప్ లైన్ లు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: