మళ్లీ అదరగొట్టిన భారత్...! చైనా గుట్టు ఒక్కొక్కటిగా విప్పేస్తోందిగా

Arun Showri Endluri
భారత్ చైనా గుట్టుని ఒక్కొక్కటిగా విప్పుతోంది. ముందుగా కరోనా వైరస్ చైనాలో ప్రబలినప్పుడు అది గబ్బిలాల నుండి వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేయగా ఆ వైరస్ ఆచూకీ తెలిసిన కొద్ది రోజుల ముందే చైనాలోని వుహాన్ మాంసపు మార్కెట్ కు సమీపంలో ఉన్న ఒక ల్యాబ్ కు పరిశోధనల నిమిత్తం గబ్బిలాలను తీసుకువచ్చారని వార్తలు బయటకు వచ్చాయి.

దీనితో ఇదేదో చివరికి తిరిగి తమ మెడకే చుట్టుకుంటుందని అనుకుందేమో కానీ చైనా ప్రభుత్వం ఈ వైరస్ గబ్బిలాల నుండి రాలేదని తమ శాస్త్రవేత్తలు చేత చెప్పించింది. ఈ వైరస్ కు మూలంగా గబ్బిలాలను కాకుండా వేరే జాతి జంతువులను వారు సూచించడం గమనార్హం. అయితే మొదటి నుంచి ఈ వైరస్ పై మరియు దాని మూలాల పై అనేక అనుమానాలు ఉన్నాయి.

అప్పట్లో కేరళతో పాటు అనేక రాష్ట్రాలను గడగడలాడించిన నిఫా వైరస్ కూడా గబ్బిలాల ద్వారా సోకినదే అనడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇక పోతే నిఫా వైరస్ సోకితే వచ్చే లక్షణాలు అన్నీ కరోనా లో కనిపించడం.. రెండిటికీ జన్యుపరంగా ఎన్నో సారూప్యతలు ఉండడం గమనార్హం. రెండూ సార్స్ వైరస్ లోని రకాలకు చెందినవే.

చైనాలో ఈ కోవిడ్-19వైరస్ వచ్చాక గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చనే డౌట్స్ వచ్చాయి. కానీ నిర్ధారణ కాలేదు. చివరికి చూష్తే ఇండియాలో భారతదేశంలో నివసించే రెండు రకాల గబ్భిలాలో ఈ కోవిడ్-19 వైరస్ కనిపించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పుణె లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీచేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఇంతకీ ఆ గబ్బిలాలు ఏవంటే... ఒకటి ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, రెండోది రౌసెటస. కూడా గబ్బిలాలు ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిదని వాటిని పరిశోధించారు.

ప్రపంచంలో రకరకాల వైరస్ లను గబ్బిలాలు తట్టుకోగలవు. అంటే ఆ వైరస్ లు బాడీలోకి వెళ్లినా... గబ్బిలాలకు ఏమీ కాదు. వాటిలో అలాంటి పవర్ ఫుల్ రోగ నిరోధక వ్యవస్థ ఉంది. అయితే గబ్బిలాల లాలాజలం - మూత్రం - లేదా అవి ఏదైనా తిని పడేసిన వాటి నుంచి - కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: