అరుంధతి రాయ్ నిజమైన భారత మేధావి...?

praveen

అరుంధతీ రాయ్.. కేరాఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఎప్పుడు ఏదో ఒక అంశం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. చాలా మంది విశ్లేషకులు ఈమె  చేసే వ్యాఖ్యలను అనవసరమైన అక్కర లేని వ్యాఖ్యలు అంటుంటారు. ఇంకొంతమంది ఈమెను  భారత మేధావి అంటుంటారు. ఏదేమైనా ఈమె  చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నే మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెను నిజమైన టువంటి భారత మేధావి అనాలేమో అంటున్నారు విశ్లేషకులు . మొదట్లో బుల్లితెర నటి ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంబంధించి ఆమె గురించి కొన్ని వివాదాలు నడిచాయి. ఆ తర్వాత కాశ్మీర్ గురించి మాట్లాడిన ఆమె వాడినటువంటి పదజాలం ఎంతగానో సంచలనం రేపింది. 

 

  సమరయోధులు అంటూ ఆమె వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇలా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఆమె. ఎన్నోసార్లు విమర్శల పాలు కూడా అయింది.  అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలు తీరును మాత్రం మార్చుకోలేదు. ఏదో ఒక అంశంపై స్పందిస్తూ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెర లేపుతోనే  ఉంటుంది. కాగా కరోనా వైరస్ వంటి మహమ్మారి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మేధావి లేక అతి తెలివితేటలు అనేది మాత్రం అర్థం కావట్లేదు అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఆమె వాడినటువంటి   పదజాలం అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటున్నారు. భారతదేశంలో అసలు కరోనా  వైరస్ ప్రభావం ఏమీ లేదని కేవలం ముస్లింల ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కరోనా  వైరస్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది అరుంధతీ రాయ్. 

 


 ఇదంతా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని.. ఈడోరకం జెనోసైడ్ అనే పదాన్ని వాడింది అరుంధతీరాయ్. అంటే ఒక మతాన్ని దెబ్బతీయడం కోసం జరిగేటువంటి యుద్ధం అనే తరహాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిపై  విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవేళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని అనుకుంటే  మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా తమ తమ రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం గురించి చెబుతూనే ఉన్నారు. వాళ్ళందరూ మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా వాళ్ళు ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతారు అంటున్నారు విశ్లేషకులు. ఇవేమీ తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడ్డం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/nIYtnsXr68c" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: