ఖమ్మంలో విజృంభిస్తున్న కరోనా... విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా కేసులు నమోదు కావటానికి గల కారణాలను అధికారులు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా కరోనా తుంపరల ద్వారా, కరోనా వ్యక్తులు తాకిన వస్తువులను తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే.
కానీ రోజురోజుకు కాంటాక్ట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా ప్రాంతాలలో కొందరికి కరోనా ఎలా సోకిందో అధికారులకే అర్థం కావడం లేదు. తొలి నుండి ఖమ్మం జిల్లాపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అకస్మాత్తుగా కేసులు పెరగడంతో అధికారులు లోతుగా విచారణ చేశారు. ఒక వ్యక్తి ఒక్క చోట తీసుకున్న షేక్ హ్యాండ్ కరోనా కేసు నమోదు కావడానికి కారణమైంది.
తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి కొంతమంది స్నేహితులను కలిశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవు. ఆ సమయంలో ఆ వ్యక్తి తన స్నేహితునికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ తీసుకున్న వ్యక్తి నుంచి ఆ వైరస్ ఎక్కడ ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల ప్రజలు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉంది.
ఎందుకంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్ భారీన పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సైతం ఏ మాత్రం కాంటాక్ట్ లేని వ్యక్తులకు కరోనా సోకింది. అందువల్ల ప్రజలు కరోనా ఉధృతి తగ్గే వరకు ఇంటికే పరిమితం కావడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.