లాక్ డౌన్ ఎఫెక్ట్ : తల్లి అంత్యక్రియలకు వెళ్ళలేకపోయిన స్టార్ హీరో... కనీసం చివరి చూపు కూడా..?
తన తల్లి చనిపోయినప్పుడు కనీసం కడచూపు నోచుకోక పోతే ఆ బాధ వర్ణనాతీతం . అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఇలాంటి ఘటన మనసును ఎంతగానో కలచివేస్తుంది. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిని కనీసం కడ చూపు కూడా నోచుకోకపోతే జీవితం వృధా అనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అయినా ఇర్ఫాన్ ఖాన్ కి ఇలాంటి ఓ చేదు జ్ఞాపకమే మిగిలిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న లేకపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయెద బేగం అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 95 సంవత్సరాలు. కాగా ఆమె మరణానంతరం అంత్యక్రియలు జైపూర్ శివారులోని చుంగి నక స్మశాన వాటికలో నిర్వహించారు.
కానీ తన తల్లి అంత్యక్రియలకు కొడుకు బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ పాల్గొనలేకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అన్ని రకాల రవాణా వ్యవస్థను మూసివేయడంతో పాటు ప్రజలను ఇంటికే పరిమితం కావాలని సూచిస్తుంది. ఇక దేశంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతున్న నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ ముంబై నుంచి రాజస్థాన్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ తల్లి అంత్యక్రియలు కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. ఇక తన తల్లి అంత్యక్రియలు ఇర్ఫాన్ ఖాన్ కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. తన తల్లిని చివరిసారిగా వీడియో కాన్ఫరెన్స్లో చూసుకున్నారు.
అయితే ఇర్ఫాన్ ఖాన్ తల్లి చాలా రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా వృద్ధాప్యం కారణంగా తాజాగా ఆమె సహజ మరణం పొందినట్లు తెలుస్తోంది. లాల్ డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియలకు వెళ్ళ లేకపోవడంపై ఇర్ఫాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. జన్మనిచ్చిన తల్లి అంత్యక్రియలు చేయకుండా కనీసం కడ చూపు కూడా నోచుకోకుండా కన్న తల్లి అంత్యక్రియలు జరగడం నిజంగా బాధాకరం.