సుఖసంసారం: నిధానమే ప్రధానమంటున్న సెక్సాలజిస్టులు
కొంత కాలం దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరూ సెక్స్ గురించి మాట్లాడుకోవడం చాలా మంచిదని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. లైంగిక ఇష్టాలను తెలుసుకోవడంతో మొదలుపెట్టి నిధానంగా అక్కడి నుంచి డర్టీ టాక్ వరకూ వెళ్లడం ఏ మాత్రం డర్టీ కాదని నొక్కివక్కాణిస్తున్నారు. శృంగారంలో పరస్పర ఇష్టాల పై అవగాహన ఉండటం ఎంతో మంచి విషయమని చెబుతున్నారు. ఒక్కోసారి ఆమెలీడ్ తీసుకుంటే కనుక ఇది సెక్స్ ను మరింత మధురానుభూతిగా మార్చగలదని హామీ ఇస్తున్నారు. అలా ఆమె చొరవ తీసుకునేలా చేయగలగడం మళ్లీ మగవాడి చేతిలోని అంశమే అంటున్నారు. అందుకు అవకాశం ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలని మగవాళ్లకు చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాల బంధాల్లో శృంగారం అనేది మరీ రొటీన్ కాకుండా ఉండాలంటే శృంగార వేదికను మార్చడమే మార్గం అని చెబుతున్నారు. బెడ్రూమ్ కాకుండా ఎక్కడ? అనే అంశంపై మీ ఆలోచనలు సాగే తీరే మీరెంత రసికులో అర్థం అయ్యేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్లేస్ లో కొత్త ఎనర్జీ, ఇంట్రస్ట్ కలుగుతుంది, కొత్తగా ఉంటుందని మాత్రం నిపుణులు అంటున్నారు.