తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి చెబుతోందా..? మరి దీని సంగతేంటి? ఈ ఆధారం చాలదా?

Arun Showri Endluri
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు భారతదేశం ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రజల మనోధైర్యం కూడా చాలా గట్టిగా దెబ్బతింది. ఎప్పుడో జనవరిలో చైనాలో మొదలైన ఈ వైరస్ ను భారత్ కు సోకకుండా ఆపేందుకు ప్రభుత్వానికి మూడు నెలల సమయం కూడా సరిపోలేదు అంటే మన దేశంలో వ్యవస్థ ఏరకంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే లాక్ పొడిగించి ప్రజలకు ఏదో మేలు చేసినట్లు భావిస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు అదే రీతిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్యలో కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే ఈ రోజు బయటికి వచ్చిన ఒక ఆఫీషియల్ ఫోటోలో తెలంగాణ ప్రభుత్వం నుండి జారీ చేయబడిన ఒక డాక్యుమెంట్ లో కరోనా పాజిటివ్ కేసు గా నమోదైన పేషెంట్ యొక్క ఐడి 1029 గా దానిపై నోట్ చేసి ఉంది. అంటే అతను రాష్ట్రంలో పాజిటివ్ గా గుర్తించబడిన 1029 వ పేషంట్ అన్నమాట. ఒక పేషెంటు కు పాజిటివ్ అని తేలిన తర్వాత చికిత్స చేయించుకుని చివరికి రికవర్ అయిపోయినా కూడా.... తర్వాత పాజిటివ్ అని తేలిన పేషెంటుకు రికవర్ అయిపోయిన పేషెంట్ నెంబరు లేదా ఐడి ను వేయరు.

అప్పటికి తెలంగాణ తమ రాష్ట్రంలో కేవలం 1003 కేసులు మాత్రమే నమోదయ్యాయి అని చెప్పగా ఒక్కసారిగా 1,029 వ పేషంటు ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు. అసలు నిజంగానే ఇప్పటిదాకా అక్కడ 1003 కేసులు మాత్రమే నమోదయ్యాయా.... లేక పేషెంట్ల యొక్క రిపోర్టులో 1,029 అనే సంఖ్య తప్పుగా పడిందా అన్న విషయంపై ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు.

అయినా ఇది అది తప్పుగా పడి ఉంటే అది ఎవరి నిర్లక్ష్యం అన్నది ఖచ్చితంగా తేలాల్సి ఉంది. మరి కావాలని సంఖ్యను తగ్గించి చెప్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేది ఏమిటో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదా ఇటువంటివి రోజుకి లక్షా తొంభై బయటకు వస్తాయి అన్నట్లు విడిచిపెడుతుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: