కరోనా ఎఫెక్ట్... ప్రపంచానికి ఎన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టమో తెలుసా....?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి భారీన పడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యమని భావిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు లాక్ డౌన్ తప్ప మరో ఉపాయం ఎవరికీ తోచడం లేదు.
మనదేశంలో నిన్నటివరకు 29,435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 934 మంది మృతి చెందారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఆర్థిక శాస్త్రవేత్తలు కరోనా వల్ల జీడీపీ 4 శాతానికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మే నెలలో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను ఎత్తివేస్తే జులైలో దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 6 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు కొనసాగితే ఈ నష్టం అంచనాలకు అందని రీతిలో పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక వేత్తలు కరోనా వల్ల అగ్రరాజ్యం అమెరికాలో సైతం జీడీపీ 6.4 శాతం కుదించుకుపోయిందని చెబుతున్నారు. చైనా, జపాన్ దేశాలలో కూడా తక్కువగా జీడీపీ నమోదవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పునాదులే కదిలిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే దశల వారీగా లాక్ డౌన్ నిబంధనలను సడలించటం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు.