హైదరబాద్ నగరవాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త...!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటివరకు దేశవ్యాప్తంగా 30,000 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కంటైన్మెంట్ల తొలగింపు చేపట్టారని తెలుస్తోంది. నగరంలో కంటైన్మెంట్ కేంద్రాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలను కూడా తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్ర నగర్ క్వారంటైన్ కేంద్రాలను వరుస క్రమంలో తొలగిస్తున్నారు. నగరంలో క్వారంటైన్ కేంద్రాలను తగ్గిస్తున్నట్లు, కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మే నెల 3వ తేదీ తరువాత ప్రధాని నిర్ణయాన్ని బట్టి తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసి కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్ల మొదట్లో ఎక్కువ కేసులు నమోదైనా రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరెక్కడా కొత్త కేసులు నమోదు కావడం లేదు. రాష్ట్రంలో సూర్యాపేట, గద్వాలలో భారీగా కేసులు నమోదైనా ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావడంతో ఆ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడం లేదు.