లాక్ డౌన్ తర్వాత పాఠశాలల్లో అవన్ని ఉండవు..?

praveen

దాదాపు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతుంది . విద్యా సంస్థలు అన్ని రవాణా వ్యవస్థలు షాపింగ్ మాల్స్  జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు అన్ని  మూసివేయబడ్డాయి. కేవలం అత్యవసర సేవలు తప్ప మిగతా ఏ సేవలు అందుబాటులోకి రాలేదు. కాగా ఏప్రిల్ 15 తో లాక్ డౌన్  ముగియాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో  ఈ లాక్ డౌన్  మే 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ రానే వచ్చేసింది. అయితే మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ మే 17 వరకు లాక్ డౌట్  కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని సడలింపులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. 

 

 

 ఈ క్రమంలోనే పాఠశాలలో ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులకు పైగా పాఠశాలల్లో మూసివేయబడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న   విద్యాసంస్థల మొత్తం మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. సరిగ్గా పరీక్షలు వస్తాయి అనుకున్న సమయానికి కరోనా  వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్  విధించడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే ఎప్పుడో  జరగాల్సిన పదవతరగతి పరీక్షలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. 

 

 

 లాక్ డౌన్  ఎత్తివేసిన తరువాత పాఠశాలలు కళాశాలలు రూపురేఖలు మారిపోనున్నట్లు తెలుస్తోంది. తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే విధానం నుంచి క్యాంటీన్లు హాస్టళ్లలో భౌతిక దూరం పాటించేలా  కేంద్ర మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను పాఠశాలలకు పాఠశాల శాఖ,  కళాశాలలకు యూజీసీ రూపొందినుండగా... ఈ నిబంధనలు  కూడా జోన్ల వారీగా కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్కూల్లో ప్రార్థనలు క్రీడలను కూడా పూర్తిస్థాయిలో రద్దు చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: