కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ కు జయహో పలికిన ప్రజలు ...!

Suma Kallamadi

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో  లాక్ డౌన్ విధానాన్ని పొడిగించాలంటూ అనేకమంది ప్రజలు కోరడం జరిగింది. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పని కనబరుస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇక మే 7వ తేదీన తెలంగాణలో లాక్ డౌన్ గడువు ముగింపు పలకనున్నది. ఈ తరుణంలో కరోనా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాయించాలా వద్దా అని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించడం జరిగింది. 

 


ఇక అందులో ఏప్రిల్ 29 నుంచి మే 2 వ తారీకు రెండో విడత సర్వే కూడా చేశారు. ఈ సర్వేలో కొనసాగించాలని 76% మంది ప్రజలు కోరడం జరిగింది. అయితే మిగితా 24 % వద్దని ప్రజలు తెలియజేశారు. ఇక ఒక్క హైదరాబాద్ లో లాక్ డోన్ పొడిగింపునకు మద్దతు ఇస్తూ 86 % మంది ఓకే తెలియజేశారు. ఇక కేవలం 14 % మంది మాత్రం దీన్ని నిరాకరించారని తెలిపింది. ఇక అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అని ప్రజలు అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది.  

 


ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని 66.4 % మంది, బాగుందని 27.2 %, పర్లేదు 5.8 %, బాగాలేదు 0.6 % అని సర్వేలో వెల్లడైంది. ఇక కరోనా నియంత్రణలో ప్రధాన మోడీ కన్నా సీఎం కేసీఆర్ పనితీరు పేరుకే ఎక్కువ శాతం మంది ఓటు వేశారని సర్వేలో తేలింది. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరు విడిగా సర్వే చేయడంలో ఎక్కువశాతం కేసీఆర్ కు జై కొట్టారనే అర్థమవుతుంది. కరోనా వైరస్ అరికట్టేందుకు కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజలు కొనియాడారు. ఇక లాక్ డౌన్ తోనే ఈ మహమ్మారిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం మంచిదేనని ఎక్కువ శాతం మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఈ తరుణంలో పేదలు కార్మికులు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకుండా రేషన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉంచారని మరి కొంత మంది ప్రజలు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: