తొలి రోజు మద్యం ద్వారా కర్ణాటకకు ఎంత వచ్చిందంటే  ?

దేశ వ్యాప్తంగా సోమవారం నుండి మూడో దశ లాక్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈలాక్ డౌన్ లో కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. అందులో మద్యం షాపులకు కూడా వెసులు బాటు కలిపించింది. గ్రీన్ ,ఆరెంజ్ జోన్లకు మాత్రమే ఈ మినహాయిపు వర్తించగా ఈరోజు పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుండే దుకాణాల ముందు భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. దాదాపు ప్రతి వైన్ షాపు ముందు ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల మందుబాబులను అదుపు చేయలేక పోలీసులు ఏకంగా షాఫులను మూసివేశారు. అయితే దాదాపు 40రోజుల తరువాత షాపులు ఓపెన్ చేయడంతో తొలి రోజు మద్యం భారీగా అమ్ముడయింది.
 
బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 50000 విలువ చేసే మద్యం కొనుగోలు చేసాడు. ఒక్క కర్ణాటక లోనే మొదటి రోజు మద్యం ద్వారా 45కోట్లు వచ్చాయని ఆ రాష్ట్ర ఏక్సైజ్ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తొలి రోజు దాదాపు 40కోట్ల మద్యం అమ్ముడయిందని అంచనా. అయితే  ఆ రాష్ట్రంలో  మద్యం ధరలను 25 శాతం పెంచిన కూడా మందుబాబులు వెనక్కితగ్గిపోవడం గమనార్హం. కాగా కేరళ , తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం మద్యం షాపులు తెరుచుకోలేదు.
 
అయితే తెలంగాణ లో వైన్ షాపుల ఓపెనింగ్ పై రేపు ప్రకటన వచ్చే అవకాశం వుంది. సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ జోన్ల లో మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడానికి  సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో  దీని గురించి చర్చించనున్నారు అలాగే లాక్ డౌన్ ను మరో రెండువారాలు  పొడిగించాడనికే కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నారట.  ప్రస్తుతానికి అక్కడ కరోనా తగ్గుముఖం పట్టినట్లే . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: