విశాఖలో హృదయ విదారక దృశ్యాలు.. అచేతన స్థితిలో చిన్నారులు.. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు..?

praveen

విశాఖ నగరంలోని గోపాలపట్నం  ఆర్ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్  కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాల మీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విషవాయువులు కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఏకంగా ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన విషవాయువు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో... తెల్లవారుజామున ఈ ఘటన జరగడం తో ప్రజలు నిద్దట్లో ఉండి నిద్దట్లో స్పృహ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు ఎక్కడికక్కడ స్పృహ  కోల్పోయి అచేతన  స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. 

 

 

 అయితే ఈ విష వాయువు ఎక్కువగా పిల్లలు మహిళల పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్నపిల్లల పరిస్థితి అయితే అద్వానంగా మారిపోయింది. ఈ విష వాయువులు పీల్చుకున్న కారణంగా నోట్లోంచి నురగలు కక్కుతూ అచేతన స్థితిలో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ విషయము కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు సమాచారం. మృతుల్లో ఇద్దరు వృద్ధులు కాగా ఒకరు ఎనిమిదేళ్ల చిన్నారి ఉండటం గమనార్హం. ఈ విషయమై వ్యాప్తి కారణంగా దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు తెలుస్తోంది. ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్తున్న ప్రజలను కేజీహెచ్కు తరలిస్తున్నారు  అధికారులు. 

 

 

 కొంత మంది ప్రజలు ఈ విష వాయువు నుంచి తప్పించుకునేందుకు తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండిపోయారు. కానీ పోలీసులు ఇళ్లను ఖాళీ చేసి దాదాపుగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దాదాపు 25 అంబులెన్సులు పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక ఆయా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ విష వాయువు కారణంగా అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో హృదయవిదారక సంఘటనలు  చోటు చేసుకుంటున్నాయి. చిన్నపిల్లలు నోట్లో నుంచి నురగలు కక్కుతూ అచేతన స్థితిలో వెళ్తుండటంతో తల్లిదండ్రుల బోరున విలపిస్తుండటంతో  ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం విషాదకరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: