ఏపీ ప్రజలకు హెచ్చరిక... ఆ నీళ్లు తాగొద్దు... ఆ పండ్లు తినొద్దు...?

Reddy P Rajasekhar

రెండు రోజుల క్రితం విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టేరైన్ విడుదలైన సంగతి తెలిసిందే. లీకైన గ్యాస్ మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతంలోని గాలి, నీళ్లు కలుషితమయ్యాయి. అక్కడ పండిన ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు తినేందుకు పనికిరావు. ఆ ప్రాంతంలోని నీళ్లు తాగేందుకు, వాడేందుకు పనికిరావు. అక్కడ బహిర్గతంగా ఉన్న ఏ పదార్థాలు తిన్నా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. 
 
ఇప్పటివరకు గ్యాస్ పీల్చిన వారిలో 12 మంది చనిపోగా దాదాపు 200 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లారు. అధికారులు ఐదు గ్రామాల వాతావరణంలో పాలిమర్ కారక విష రసాయనాలు ఉన్నాయని... ఆ గ్రామాలకు రావద్దని చెబుతున్నారు. 
 
గ్యాస్ లీకేజీ తరువాత వెంకటాపురం గాలిలో మార్పులు వచ్చాయి. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ స్థాయిలు తగ్గాయి. వాతావరణంగా భాష్ప వాయువుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కళ్లలో మంట పుట్టి కనీరు వస్తోంది. కొందరికి కడుపులో వికారం పుట్టి వాంతులవుతూ ఉన్నాయి. కొందరికి చర్మంపై బొబ్బలు, దద్దుర్లు వస్తున్నాయి. గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలోనే రిజర్వాయర్ ఉంది. 
 
పంట పొలాలు కలుషితం కావడంతో అక్కడ పండిన పంటలు తినకూడదు. బహిర్గతంగా ఉన్న కూరగాయలను తిన్నా, మూత లేకుండా ట్యాంకుల్లో ఉన్న నీటిని వినియోగించినా ప్రమాదమే. ఆ ప్రాంతంలోని నీటిని తాగితే కాలేయం, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో గ్యాస్ ప్రభావం వెంటనే కనిపించకపోయినా భవిష్యత్తులో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: