మజ్జిగ తాగి చనిపోయిన భర్త.. భార్య చేసిందనే అనుమానాలు..అసలు మ్యాటర్ అదే?
ఇకపోతే భార్య భర్తల మధ్య కీచులాటలు రోజు రోజుకు పెరుగుతున్నాయని భర్తను కడతేర్చిన ఘటన ఆలస్యంగా వచ్చింది..భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతుండడం కూడా అందుకు బలాన్ని చేకూర్చింది. మజ్జిగలో విషం కలిపి భర్తను హత్య చేసిందన్న ఆరోపణలతో వ్యక్తి మరణం మిస్టరీగా మారింది. అయితే అది హత్యా? లేక సాధారణ మరణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలేనికి చెందిన ఏడుకొండలరెడ్డి హఠాత్తుగా మరణించాడు. సడెన్‌గా భర్త చనిపోవడంతో భార్యపై అనుమానాలు రేగాయి. ఇద్దరి మధ్య కొద్ది నెలల నుంచి గొడవలు జరుగుతుండడంతో భార్యే ఘాతుకానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందని.. అవి తాగి ఏడుకొండలరెడ్డి మరణించాడని బంధువులు ఆరోపించడంతో మరణం మిస్టరీగా మారింది...
విషయం తెలుసుకున్న పోలీసులు ఏడుకొండలరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి పంపారు. విషప్రయోగం వల్లే ఏడుకొండలరెడ్డి చనిపోయాడంటూ బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆయనది మర్డర్ లేక పక్క ప్లాన్ చేసి చంపారా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే వివరాలు చెప్తామని పోలీసులు తెలిపారు..