ఆంధ్రా వాసులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్.. సొంత ఊర్లకు వెళ్లాలంటే..!!!

Satvika

ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

 

అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 

 

 

ఏపీ ప్రజల కోసం జగన్ సర్కార్ స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేయగా.. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.

 

 

 

 

ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అంతేకాక పాస్ లు నమోదు చేసుకోవడానికి కొన్ని సూచనలు కూడా అందజేసింది.. అవెంటంటే...

 

 

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

 

ప్రయాణించేవారి వివరాలు

 

ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్

 

 మెయిల్ ఐడీ

 

 అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు

 

 మొబైల్ నంబర్

 

వాహనానికి సంబంధించిన వివరాలు

 

 

 

 

ఈ ప్రొసెస్‌లో వెరిఫికేషన్ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించాలని పోలీస్‌శాఖ సూచించింది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఓ రిసిప్ట్ వస్తుంది.. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉండి.. కారణాలు నిజమైతే ఆ తర్వాత మీకు ఈసారి రూటు పాస్ ను పొందవచ్చున ట.. ఇంక ఆలస్యమెందుకు పాసులకు ఇప్పుడే దరఖాస్తులు చేసుకోండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: