మాంసం కొనడానికి దుకాణానికి వెళ్లుతున్నారా.. అయితే ఇవి గమనించండి.. లేదంటే.. ?

venugopal

కరోనా ప్రజల జీవితాల్లోకి చేరిన కొత్త బంధువు.. ఎన్నాళ్లని ఈ చుట్టాన్ని దూరంగా పెడదాం.. ఇప్పటి దాకా దీనికి భయపడి దాక్కున్నాము.. మరి ఇంత కాలం దాకున్న అది తిరిగి వెళ్లిపోయిందా అంటే అదీ లేదు.. ఇక ఇలాగైతే కాదు.. దీన్ని కూడ మన సంఘంలో కలిపేయాలని నిర్ణయించిన ప్రభుత్వాలు మెల్లమెల్లగా లాక్‌డౌన్ తొలగిస్తూ, ప్రజల్లారా మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి.. ఎన్ని రోజులని పోలీసులను అడ్డుపెడతాము.. ఒక్క సారి దీనితో దోస్తాన్ అలవాటైతే అదే సర్దుకుంటుందని భావించి ప్రజలకు స్వేచ్చను ఇస్తున్నారు.. ఇందులో భాగంగా మొదట వైన్స్ షాప్‌లను ఒపెన్ చేశారు.. ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని ప్రజా సౌకర్యాలకు అవకాశం కల్పిస్తున్నారు..

 

 

ఇకపోతే ఎలాగో ఒపెన్ అయ్యాయి కదా ఇక కరోనా లేదని అనుకోకండి.. ఇది బందిపోటు దొంగల కంటే మహా ముదురు.. ఇదిలా ఉండగా ఇన్నాళ్లు మూగబోయినా తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో షాపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, నాన్ వెజ్ అమ్మే దుకాణదారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక కరోనా నేపధ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏమిటో పరిశీలిస్తే.. ముందుగా మాంసాన్ని కోసే కత్తులను వేడి నీటితో తప్పని సరిగ్గా కడగాలి. ఇదివరకట్లా ఎలా పడితే అలా ఉండకుండా షాపుల్లో పని చేసే వారు ఆప్రాన్, గ్లౌజులు, హెడ్ గేర్ ధరించాలి. అదీగాక అన్ని దుకాణాల్లో చెత్త బుట్టలు తప్పని సరిగ్గా ఉండాలి..

 

 

చెత్త వేసే బిన్ లకు ఎట్టిపరిస్దితుల్లో రంధ్రాలు ఉండరాదు. ఇక ముఖ్యంగా మాంసం దుకాణాల్లో పని చేసే వారికి చర్మ వ్యాధులు, అలర్జీలు ఉండరాదు. చేతికి, కాళ్లకు గోర్లు పెంచుకోరాదు. మాంసం మీద ఈగలు వాలకుండా చూసుకోవాలి.. దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రపరుస్తూ, వాసన లేకుండా చూసుకోవాలి. ఇక మాంసంలో వచ్చే వ్యర్థాలను బయట పడేయకుండా, అవి టన్ను కంటే తక్కువ ఉంటే భూమిలో పూడ్చిపెట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బయో మేథనేషన్ ద్వారా నిర్మూలించాలి.

 

 

ఇక ఈ నిబంధనలు ఆన్ని మాంసం దుకాణాదారులు తప్పక పాటించాలి.. లేని పక్షంలో ఆ దుకాణాల మీద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.. సో మాంసం ప్రియులు మీరుకూడా అక్కడకు వెళ్ళినప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకోండి లేదంటే ఒక్కపూట మాంసంతో అనారోగ్యం పోంచి ఉంటుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: