మోదీ పాలనలో మారిన భారత్.... ప్రత్యర్థి దేశాలకు చుక్కలే...?

Reddy P Rajasekhar

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో భారతదేశంలో చాలా మార్పులొచ్చాయి. భారత్ కు హాని తలపెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే ప్రస్తుతం భారత్ ఊరుకోదని ప్రత్యర్థి దేశాలకు అర్థమవుతోంది. చైనా ఆగినా, పాక్ వెనక్కు తగ్గినా అభినందన్ విడుదల దగ్గరి నుండి భారత్ ప్రత్యర్థుల సరిహద్దులకు వెళ్లి మరీ యుద్ధం చేసినా మోదీ పాలనలో వచ్చిన మార్పులే కారణం. భారత్ ఇలా మారడానికి అమెరికా, ఇజ్రాయిల్ దేశాల ప్రభావం భారత్ పై పడటం కూడా మరో కారణం అని తెలుస్తోంది. 
 
మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని భారత్ ఇతర దేశాలకు అర్థమయ్యేలా చేస్తోంది. ఇజ్రాయిల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న 16 దేశాలు ఆ దేశానికి శత్రువులే. ఇజ్రాయిల్ అపాయం కలిగిస్తుందన్న దేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. అమెరికా కూడా శత్రు దేశాల విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తోంది. అమెరికా కోపం వస్తే ఇతర దేశాలపై పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 
 
కానీ భారత్ ఇతర దేశాలపై పగ, ప్రతీకారాలు చూపకపోయినా భారత్ ను ఇబ్బందులు పెట్టాలని మాత్రం ఆ దేశాలపై యుద్ధానికి దిగడానికైనా సిద్ధమే అని ప్రకటిస్తోంది. అమెరికా తమకు హాని తలపెడతారాన్న దేశం ఏ మూల ఉన్నా వారిని ఊరికే వదిలిపెట్టదు. బలమైన ఆర్థిక వ్యవస్థ, అమేయమైన సైనిక సంపత్తి అమెరికా సొంతం. అందుకే అమెరికా అంటే ఏ దేశమైనా భయపడుతుంది. 
 
ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. శత్రువు దాడి చేస్తే ఇజ్రాయిల్ దాడి కూడా మామూలుగా ఉండదు. ప్రాణం పోయినా కూడా ఇజ్రాయిల్ వెనుదిరిగే ప్రసక్తి ఉండదు. ఇజ్రాయిల్ ఆ విధంగా వ్యవహరించకపోతే ఎప్పుడో ఇతర దేశాల్లో కలిసిపోయేది. భారత్ కూడా మోదీ పాలనలో అదే తరహా విధానాన్ని అవలంబిస్తోంది. కాళ్లబేరానికి పోతే పనులు జరగని... మన దేశం జోలికి వస్తే వెన్నులో వణుకు పుట్టాలని స్థిరమైన నిర్ణయం తీసుకుని అదే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ కంగారు పెడితే కంగారు పడే పరిస్థితిలో లేదని... ప్రత్యర్థిపై దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉందని ప్రత్యర్థి దేశాలకు చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: