దేశ ప్రజలకు శుభవార్త... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడంటే...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల పరంగా భారత్ ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. దేశంలో మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.
చైనా దేశం ప్రస్తుతం వ్యాక్సిన్ల తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. చైనా మూడు రకాల వ్యాక్సిన్లను అభివృద్ధి చేశామని... రెండు వ్యాక్సిన్లకు ఇప్పటికే క్లినికల ట్రయల్స్ పూర్తి చేశామని చైనా చెబుతోంది. చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్ సంస్థ సినోవాక్ చైనా తయారు చేసిన వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుందని పేర్కొంది. వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్స్, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్స్ అభివృద్ధి చేసిన ఈ టీకాను 2 వేల మందిపై పరీక్షించినట్టు తెలుస్తోంది.
ఏడాదిలో 100 మిలియన్ల నుంచి 200 మిలియన్ల వ్యాక్సిన్ లను తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘వియ్‌చాట్’లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను ఉపయోగిస్తే వారు కరోనా భారీన పడే అవకాశం ఉండదు. చైనాలో కూడా గత కొంతకాలంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు ఇటలీలో కూడా కరోనా వ్యాక్సిన్ సిద్ధమైంది. ఐతే ఇటలీ కరోనా వ్యాక్సిన్ ను మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి చేయాలంటే మాత్రం ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చైనా ప్రస్తుతం తయారు చేసిన వ్యాక్సిన్లను మనుషులపై పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు చైనాలో కేసులు తక్కువగా ఉండటం వలన వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలను యూకేలో చేపట్టబోతున్నట్లు సినోవాక్ వెల్లడించింది.