వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్..!!

KSK

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ మృతికి నిరసనగా ఆందోళనలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. ఆందోళనకారులను అరికట్టడానికి అమెరికా పోలీసులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అయినా కానీ ఏ మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం లేదు. మరోపక్క అధ్యక్ష ఎన్నికలు రాబోతున్న తరుణంలో అమెరికాలో ట్రంప్ పరిపాలనపై తీవ్ర స్థాయిలో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏకంగా వైట్ హౌస్ ముందు ఉన్నపోలీస్ కారును ఆందోళనకారులు తగలబెట్టడం తో పరిస్థితి మొత్తం చెయ్యి దాటిపోయే ఈ విధంగా ఉంది.

ఇటువంటి నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న వీధులు భద్రతా దళాల తో నిండి పోవాలని అధికారులకు ఆదేశించారు. ఆందోళనలు నియంత్రణ వచ్చేవరకు మేయర్ లు మరియు గవర్నర్లు సహకరించాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.వెంటనే రాష్ట్రాలలో అల్లర్లను నివారించకపోతే, ఇందుకోసం నేషనల్ గార్డులను అనుమతించకపోతే, తాను సైన్యాన్ని రంగంలో దించవలసి వస్తుందని రాష్ట్ర గవర్నర్లకు వార్నింగులు ఇచ్చారు. శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

గవర్నర్లు బలహీనంగా ఉండడం వల్లే నిరసనలు ఈ స్థాయికి చేరాయని ఆరోపించారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేయాలని, పదేళ్లపాటు జైల్లో పెట్టండి. అప్పుడు ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో మేం అదే చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజలు చూడని చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. అమెరికా నిర్మాణాన్ని కోరుకుంటుందని విధ్వంసం కాదని, సహకారం కోరుకుంటుందని ప్రతిఘటన కాదని, భద్రత కోరుకుంటోందని అరాచకం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: