‘జార్జ్ ఫ్లాయిడ్’ భార్య సంచలన నిర్ణయం.. అమెరికా లో సరికొత్త సెన్సేషన్ !

KSK

అగ్రరాజ్యం రణరంగంగా మారింది. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ‘ఐ కాంట్ బ్రిత్’ అంటోంది. అమెరికా దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ నల్ల జాతీయుడి హత్య కి వ్యతిరేకంగా 140 నగరాలలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గుంపులు గుంపులుగా జనం రోడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసుల వాహనాలకు నిప్పు పెడుతూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు డానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళనకారులు తగ్గకపోతే శాంతించకపోతే తుపాకులు గర్జిస్థాయి అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకారులకు నిప్పుమీద కిరసనాయిలు పోసినట్టు అనిపించి  విధ్వంసాలకు పాల్పడుతున్నారు.

ఇదే సమయంలో జార్జ్ ఫ్లాయిడ్ ని హత్య చేసిన పోలీస్ అధికారికి  భార్య నుండి షాక్ ఎదురైంది. తన భర్త నుండి విడాకులు ఇప్పించాలని ఆమె కోరింది. అంతేకాకుండా తన పేరు చివరన జార్జ్ ఫ్లాయిడ్ ని హత్య చేసిన పోలీస్ అధికారి పేరు చౌవిన్ కూడా తొలగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. చౌవిన్ పేరు నాకు ఎంతో అవమానంగా ఉంటోంది అని ఆమె పిటిషన్ లో తెలిపింది.

నేను నా భర్త నుంచీ విడిపోవాలని అనుకున్న సమయంలో ఆ పేరు నాకు అవసరం లేదు అంటూ పిటిషన్ కోర్టులో వేసింది. ఇదే సమయంలో ‘జార్జ్ ఫ్లాయిడ్’ భార్య కూడా సదరు పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడని  కి రెడీ అవుతోందట. అంతేకాదు అమెరికా న్యాయస్థానంలో సరికొత్త సెన్సేషన్ పిటిషన్ వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: