జగన్ తెలివితేటలు మామూలుగా లేవే ? బీజేపీ జనసేనకూ చిక్కులే ?

ఏపీలో విపక్షాలు అన్నీ ఒకవైపు, అధికారపక్షం మరోవైపు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తెలుగుదేశంతో పాటు, బిజెపి జనసేన పార్టీలు అడుగడుగున వ్యతిరేకిస్తూ, నానా హంగామా చేస్తున్నాయి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇంతే కాబట్టి ఆ పార్టీని పరిగణనలోకి తీసుకోక పోయినా, మొదట్లో తమతో సఖ్యతగా ఉన్న బిజెపి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి కంటే ఎక్కువగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం, ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన కూడా పదేపదే వైసీపీ కించపరిచే విధమైన వ్యాఖ్యలు చేస్తుండడం ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. అందుకే బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అటు బిజెపి జనసేన తో పాటు, టిడిపిని కూడా కంట్రోల్ చేయవచ్చనేది జగన్ ఎత్తుగడగా తెలుస్తోంది. 


ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ విభజన కష్టాల్లో చిక్కుకుంది. అన్ని రకాలుగానూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైసిపి ప్రతిపక్షంలో ఉండగా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది. ఢిల్లీకి ప్రత్యేక రైల్లో వెళ్లి మరీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆ విషయంలో అప్పటి అధికార పార్టీ టిడిపి చూసీచూడనట్లు వ్యవహరించడం, ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీ తీరుపై విమర్శలు రావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ప్రత్యేక హోదా సంగతి వైసిపి ప్రభుత్వం కూడా మరిచిపోయిందని, ప్రతిపక్షంలో ఉండగా హడావుడి చేసిందనే విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, తమను పదేపదే విమర్శిస్తున్న బిజెపి, జనసేన కు చెక్ పెట్టాలంటే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మళ్లీ లేవనెత్తి రాజకీయంగా మైలేజ్ పొందాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


 కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా, కేవలం ఉపవాస దీక్షలతో నిరసనలనలతోనూ, నిత్యం బిజీగా గడుపుతున్న బీజేపీకి గట్టి షాక్  ఇవ్వాలంటే ప్రత్యేక హోదా విషయాన్ని లేవనెత్తాలని, అలాగే జనసేన ను కూడా ఈ విషయంలో గట్టిగా టార్గెట్ చేయవచ్చని, ఒకవేళ తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం లేవనెత్తితే వెనకడుగు వేస్తుందని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తగిన కార్యాచరణ రూపొందించాలని జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: