EPF అకౌంట్ లో తప్పులు సరిద్దిదుకోవాలా ...? ఇలా చేయండి ...!

Suma Kallamadi

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఒక విజ్ఞప్తి. ఈపీఎఫ్ వో తన వినియోగదారులకు అనేక రకముల సేవలు అంద చేస్తుంది. ఇందులో పిఎఫ్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కూడా ఒక చిన్న విషయం. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ లో వివరాలు తప్పుగా ఉన్నట్లు అయితే... ఆన్లైన్ ద్వారా సులువుగా కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. పీఎఫ్ అకౌంట్ వివరాలు కరెక్ట్ గా ఉంటే  ఆన్లైన్ లోనే డబ్బులు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా డబ్బును విత్ డ్రా చేసుకోవాలి అంటే ముందుగా అకౌంట్ వివరాలు కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అప్పుడైతేనే సులువుగా డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

 

ఏప్రిల్ మే నెలలో దాదాపు 52 లక్షల మంది వినియోగదారులు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడం జరిగింది. అలాగే పిఎఫ్ సబ్ స్క్రైబర్స్ కూడా ఆన్లైన్ ద్వారా సులువుగా పీఎఫ్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది ఇప్పుడు. ఒక అప్డేట్ కోసం ముందుగా ఈపీఎఫ్వో పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన UAN నెంబర్ పాస్వర్డ్ కచ్చితంగా మనకు ఉండాల్సిందే. 


ఆ తర్వాత లాగిన్ అయ్యి ఆప్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ అకౌంట్ పై బేసిక్ డీటెయిల్స్ అని ఆప్షన్ ఉంటుంది దాని పై క్లిక్ చేయాలి. అంతేకాకుండా ఆ తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉంటే పర్సనల్ డీటెయిల్స్ మార్చుకోవడం వీలు కాదు. లేకపోతే ముందుగా ఆధార్ నెంబర్ ప్లాట్లలో నెంబర్ పెట్టి తర్వాత పేరు తదితర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే. UAN నెంబర్ తో ఆధార్ లింక్ అయిన వెంటనే ఆన్లైన్లో పిఎఫ్ డబ్బులను సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేసుకో లేకపోతే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: