ఈ విధంగా రోజా ప్రాధాన్యత ఏంటో చెప్పిన జగన్ ?

వైసీపీలో రోజా ప్రాధాన్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆమె దూకుడు స్వభావం, పంచ్ డైలాగులు, తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు ను టార్గెట్ చేసుకుని పదునైన బాణాల్లాంటి డైలాగులతో రోజా చేసే విమర్శలు ఇలా ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక వైసీపీ గెలిచిన తర్వాత ఆమెకు జగన్ క్యాబినెట్ లో కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించినా జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, ఆమె అలగడం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ఇక ఆ తరువాత ఆమెను బుజ్జగించేందుకు ఏపీ ఐసీసీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసందే. ఆమె మాత్రం తాను రెండో విడతలో అయినా మంత్రి పదవి వస్తుందనే ఆశలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే జగన్ మాత్రం ఆమెను దృష్టిలో పెట్టుకున్నారు. 

 


కేవలం సామజిక వర్గాల సమీకరణాల లెక్కల్లో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవి దక్కి ఉండేది. తాజాగా మరో కీలక బాధ్యతలు రోజాకి అప్పగించాలని సిఎం ఆలోచనలో ఉన్నట్టుగా వైసిపి వర్గాల్లో చర్చ నడుస్తుంది. సినీ హీరోయిన్ గా వెండితెరపై వెలిగిన రోజా అనుభవాలను ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ పరిశ్రమను ఆదుకోవడానికి జగన్ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. తెలంగాణ కే పరిమితం అయ్యింది అన్నట్టుగా ఉన్న సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించాలని జగన్ ఆలోచనలో ఉన్నారట. కొద్దీ రోజుల క్రితం  తనను కలిసిన చిరంజీవి ఇతర ప్రముఖులతో ఇదే విషయాన్నీ కూడా జగన్ చర్చించారు. 

 

తాజాగా వైరస్ ఎఫెక్ట్ తో తీవ్ర కష్టాలు నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవడానికి జగన్ అందరికన్నా ముందుకు వచ్చారు. ఎపి లో షూటింగ్స్ కి ఉచితంగా అనుమతి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం సిద్ధం అయినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కి ఎలా అనుమతులు ఇవ్వాలి ? ఎవరికి ఇవ్వాలి వంటి అనేక అంశాలకు సంబంధించి రోజాకు ఉన్న అవగాహనతో నెట్టుకురాగాలని, మిగతా వారితో చిత్ర పరిశ్రమపై జగన్ వేయబోయే కమిటీ బాధ్యతలు ఆర్కే రోజాకు అప్పగించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఎపి లో ప్రోత్సహాలు అందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే రోజా హవా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: