బాలయ్యకు జగన్ సపోర్ట్ ఉందా? అక్కడ క్లారిటీ వస్తుందా?

M N Amaleswara rao

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య గతంలో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలిటికల్ వర్గాల్లో ఎక్కువ చర్చలు నడిచాయనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి రాకమునుపు జగన్...బాలయ్య అభిమాని అనే విషయం కూడా ఎక్కువగానే ప్రచారం జరిగింది. ఇటీవల కూడా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.

 

అయితే ఇలా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే అనుకుంటా...జగన్ ఎప్పుడు బాలయ్య మీద విమర్శలు చేయరు. చంద్రబాబు, టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేసే జగన్...బాలయ్య గురించి ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఏదో ఎన్నికల సమయంలో, అసెంబ్లీలో ఒకటి, రెండు సార్లు మాత్రమే బాలయ్య మీద పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే బాలయ్య కూడా వైసీపీ మీద విమర్శలు చేసేవారు గానీ, జగన్ పేరు పెట్టి పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు.

 

ఇక హిందూపురం నియోజకవర్గం విషయంలో కూడా జగన్ అంత ఫోకస్ పెట్టి, బాలయ్యని ఓడించాలని చూడరనే ఉద్దేశం బాలయ్య అభిమానుల్లో ఎక్కువ ఉంది. హిందూపురంలో నందమూరి ఫ్యామిలీకి ఎలాగో గట్టి పట్టు ఉంటుంది. అందుకే అక్కడ ఒక్కసారి కూడా టీడీపీ ఓడిపోలేదు. గత రెండు పర్యాయాల కూడా బాలయ్య అక్కడ నుంచి గెలుస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో బాలయ్య ఓడిపోతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

 

అక్కడ టీడీపీ బలం కావొచ్చు, జగన్ పెద్దగా ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేయకపోవడం కావొచ్చు బాలయ్య మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఇటీవల కూడా వైసీపీ ఎమ్మెల్యే, ఏపి‌ఐ‌ఐసి  చైర్‌పర్సన్‌గా ఉన్న రోజాతో బాలయ్య మాట్లాడి, హిందూపురం పారిశ్రామిక అభివృద్ధి చేయాలని చెప్పగా, రోజా వెంటనే ఒకే చెప్పేశారు. ఒకవేళ వేరే టీడీపీ ఎమ్మెల్యేలు అడిగితే ఇలా వెంటనే స్పందన వస్తుందా? అంటే చెప్పలేం. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తుంటే బాలయ్యకు జగన్ సపోర్ట్ ఉన్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: